Viral Photo : చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆయన అభిమానులు రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళికి ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరికి తెలియదు. అయితే సామాజిక మాధ్యమాలలో హీరో మహేష్ బాబుకు సంబంధించిన పాత ఫోటోలు, రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన ఒక త్రో బ్యాక్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో హీరో మహేష్ బాబు తో పాటు క్యూట్ స్మైల్ తో ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది బాగా ఫేమస్ అయ్యింది.
Also Read : రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!
ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ వంటివి చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఫ్యాషన్ బ్లాగర్ గా కూడా ఈమెకు బాగా గుర్తింపు ఉంది. కొన్ని ప్రకటనలలో కూడా నటించి ఈమె బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఈమె క్యూట్నెస్ కు ఫిదా అయిన నిర్మాతలు ఆమెకు సినిమాలలో నటించే అవకాశం ఇచ్చారు. చిన్న సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ నటించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం నెట్టింట బాగా వినిపిస్తుంది. ఏకంగా ఈ బ్యూటీ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
ఈ అమ్మాయి మరెవరో కాదు రమ్య పసుపులేటి. రమ్య పసుపులేటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాతో రమ్య పసుపులేటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పలు యాడ్స్ లో నటించి చిన్నతనంలోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. అనుష్క హీరోయిన్ గా నటించిన పంచాక్షరి సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక విశ్వంభర సినిమాలో రమ్య పసుపులేటి చిరంజీవి చెల్లెలిగా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram