Star Heroine: ఈ హీరోయిన్ తండ్రి రాజకీయాలలో పెద్ద నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె కుటుంబంలో చాలామంది పొలిటీషియన్స్ గా రాణిస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం నటన పై తనకున్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ రంగంలో తన కెరియర్ ప్రారంభించిన ఈ చిన్నది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమా టాలీవుడ్ లోనే చేసింది. కానీ మీకు అంతగా అదృష్టం కలిసి రాలేదు. ప్రముఖ రాజకీయ ఫ్యామిలీ నుంచి ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 16 వేల సినీ ప్రయాణంలో కేవలం బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక హిట్టు మాత్రమే సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ నటిగా మాత్రం ప్రయాణించలేకపోయింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది హీరో హీరోయిన్లు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
ఇలా భూమి పెడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ సింగ్ వంటి నటులు తమ కుటుంబ వారసత్వాన్ని కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ వీళ్ళలో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో దాదాపు స్టార్స్ అందరితో కూడా కలిసి నటించిన. ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు నేహా శర్మ. హీరో రామ్ చరణ్ కు జోడిగా చిరుత సినిమాతో స్నేహ శర్మ 2007లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. చిరుత సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా. ఆ తర్వాత నేహా శర్మ కుర్రాడు అనే సినిమాతో మరోసారి 2009లో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
2010లో నేహా శర్మ హిందీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నేహా శర్మ రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన హీరోయిన్ గా మెప్పించింది. 2010లో నేహా శర్మ నటించిన క్రూక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయం తర్వాత నేహా శర్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ 16 ఏళ్ల నేహా శర్మ సినీ ప్రయాణంలో ఇప్పటివరకు కేవలం ఒక హిట్ మాత్రమే పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తులు రూ.22 కోట్లు అని తెలుస్తుంది. హీరోయిన్ నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ బీహార్ రాష్ట్ర శాసనసభలో భాగల్పూర్ నియోజకవర్గం నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు. అజిత్ శర్మ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. 2020 నుంచి నేహా శర్మ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
View this post on Instagram