https://oktelugu.com/

అల్లరి నరేశ్ గురించి ఆసక్తికర విషయాలివీ

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకు అల్లరి నరేష్. నరేష్ అన్నయ్య అర్యన్ రాజేశ్ కూడా హీరోనే.. అయితే రాజేష్ నరేష్  అంతగా సక్సెస్ కాలేదు. అల్లరి సినిమాతో నరేష్ తెలుగు తెరకు పరిచయం కావడంతో అల్లరి నరేష్ గా ఇండస్ట్రీలో ముద్రపడిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని పాపులర్ అయ్యాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ 1982 జూన్ 30న అల్లరి నరేష్ జన్మించాడు. నరేష్ చదువు అంతా చెన్నైలోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 / 03:13 PM IST
    Follow us on

    ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకు అల్లరి నరేష్. నరేష్ అన్నయ్య అర్యన్ రాజేశ్ కూడా హీరోనే.. అయితే రాజేష్ నరేష్  అంతగా సక్సెస్ కాలేదు. అల్లరి సినిమాతో నరేష్ తెలుగు తెరకు పరిచయం కావడంతో అల్లరి నరేష్ గా ఇండస్ట్రీలో ముద్రపడిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని పాపులర్ అయ్యాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    1982 జూన్ 30న అల్లరి నరేష్ జన్మించాడు. నరేష్ చదువు అంతా చెన్నైలోనే సాగింది. నరేష్ నాన్న ప్రముఖ దర్శకుడు కావడం.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ముప్పై ఏళ్ల క్రితం చెన్నైలోనే ఉండడంతో నరేష్ చదువు కూడా అక్కడే సాగింది.  నరేష్ వివాహం 2015 మే 29న హైదరాబాద్ లోని ఎన్ కన్వేన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. నరేష్ చెన్నైకి చెందిన విరూప కంఠమనేనిని వివాహం చేసుకున్నాడు. నరేష్ భార్య అస్సలు సినిమాలు ఎక్కువగా చూడదట. ఈ విషయాన్ని స్వయంగా నరేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆమెకు సినిమాల గురించి అస్సలు నాలెడ్జ్ కూడా లేదట.. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట..

    Also Read: విక్రమ్ టైలర్ టాక్: విరుచుకుపడిన కమల్ హాసన్..!

    నరేష్ భార్య విరూప ప్రముఖ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు చెన్నైలోనే ఉంటారు. వీరి స్వస్థలం విజయవాడ. విజయవాడలో బాల్యం గడిపిన విరూప తెలుగు మూలాలున్న అమ్మాయే. వీరి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా చెన్నైలో సెటిల్ కావడంతో అక్కడే విరూప చదువులు సాగాయి. బాగా చదువుకున్న విరూప ప్రముఖ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉండేది. తర్వాత పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్ వచ్చి అదే ఆర్కిటెక్టర్ గా సేవలందిస్తోంది. అయితే ఇప్పటివరకు నరేష్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా మాత్రమే విరూప చూసిందట..

    Also Read: మహేష్ తో సినిమా.. మంజుల అత్యాశకు పోతుందా?

    నరేష్ కు పెళ్లి చేయాలని భావించిన ఈవీవీ సత్యనారాయణ తనకు బాగా తెలిసిన చెన్నైలో వెతకగా విరూప సంబంధం వచ్చిందట.. అలా పెద్దలు కుదర్చడంతో విరూపను నరేష్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ విరూప హైదరాబాద్ లో ఆర్కిటెక్టర్ గా సేవలందిస్తోంది. నరేష్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అతడి సినిమాలు చూసేందుకు విరూప ఆసక్తి చూపదట. అలా సినీ నేపథ్యం లేని విరూప కు ఇటీవలే ఓ పాప కూడా పుట్టింది. పాప పేరును ఆయానా ఈవిక ఏడార అని పేరు పెట్టారు. ప్రస్తుతం భర్త, కుమారుడితో విరూప సంతోషంగా  గడుపుతోంది.