Vikram Chiyaan: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
కాగా, మరోవైపు, సర్కారు వారి పాటతో పలకరించేందుకు మహేశ్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత మహేశ్ హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే విలన్ క్యారెక్టర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా అనగానే హీరోకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. విలన్‌కు కూడా అంతే ఎలివేషన్ చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేశ్- రాజమౌళి కాంబో మూవీలో హీరో విక్రమ్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పేరును ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రా బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలీష్ లుక్‌లో కనిపిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vikram chiyaan will play villian role in rajamouli movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com