Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: అని మాస్టర్ అవుట్, అనుకున్నదే జరిగింది...

Bigg Boss 5 Telugu: అని మాస్టర్ అవుట్, అనుకున్నదే జరిగింది…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 77 రోజులు పూర్తి చేసుకుని విజయవంతం గా ప్రసారం అవుతుంది. అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు రానే వచ్చింది.ఈ ఒక్కరోజు ఆగితే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నవిషయం ఖచ్చితం గా తెలిసిపోతుంది. అఫీషియల్ గా ఇంకా తెలియనప్పటికీ అన్ అఫీషియల్ గా సామాజిక మాధ్యమాల్లో అయితే శనివారం సాయంత్రమే తెలిసిపోయింది.

Bigg Boss 5 Telugu
Anee Master

ఇప్పటికే బిగ్ బాస్ నుండి పది మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ ) ఎలిమినేట్ అయ్యారు. అలా పదకొండోవారానికి ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి గానూ కెప్టెన్ రవి మినహియించి మిగతా ఇంటి సభ్యులు షన్ను, సన్నీ, మానస్, కాజల్, సిరి, ప్రియాంకా సింగ్, శ్రీరామచంద్ర, అని మాస్టర్ నామినేట్ అయ్యారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం మాత్రం అయితే తెలిసిపోయింది.

అని మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంతకాళ్లపై నిలపడి, కస్టపడి బిగ్ బాస్ ఇంటి కి వచ్చే స్టేజ్ దాకా ఎదిగింది. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమ వారం ఎవరొకరు నామినేట్ అవ్వాల్సిందే. ప్రతి ఆది వారం నాగార్జున చేతుల మీదగా బిగ్ బాస్ ఇంటిని వీడి తమ ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఈ ప్రక్రియలో అని మాస్టర్ (Anee Master) పదకొండో వారానికి గాని ఎలిమినేట్ అయ్యింది.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
RELATED ARTICLES

Most Popular