Vikram Breaks Bahubali2: ఇటీవల కాలం లో సౌత్ లో పుష్ప, #RRR మరియు KGF చాప్టర్ 2 సినిమాలు తర్వాత ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా కమల్ హాసన్ నటించిన విక్రమ్..ఖైదీ మరియు మాస్టర్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా కావడం..దానికి తోడు టీజర్ మరియు ట్రైలర్స్ అభిమానులను మరియు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం తో కమల్ హాసన్ నుండి చాలా కాలం తర్వాత ఒక్క సూపర్ హిట్ సినిమా రాబోతుంది అనే ఫీలింగ్ ని ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చింది..అందరి అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం..బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది..కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు..ఈ సినిమా తెలుగు లో కూడా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతుంది అంటే ఈ సినిమా ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటిన ఈ సినిమా ఇప్పుడు మరో మైలురాయిని దాటబోతుంది..తమిళనాడు లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా ఎలాంటి సెన్సషనల్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా రికార్డుని అక్కడి స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్ మరియు అజిత్ వంటివారు కూడా దాటలేకపొయ్యారు..కేవలం తమిళనాడు నుండే ఈ సినిమా 155 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ రికార్డు కి దగ్గరగా విజయ్ నటించిన బిజిల్ మరియు అజిత్ హీరో నటించిన విశ్వాసం సినిమాలు వెళ్లాయి కానీ, బాహుబలి 2 రికార్డుని మాత్రం ఫుల్ రన్ లో క్రాస్ చేయలేకపోయాయి..కానీ కమల్ హాసన్ విక్రమ్ సినిమా బాహుబలి 2 రికార్డు ని అతి తేలికగా దాటబోతుంది..కేవలం 10 రోజులకే ఈ సినిమా తమిళనాడు నుండి 135 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది..మరో రెండు రోజుల్లో బాహుబలి 2 రికార్డు ని కొల్లగొట్టి తమిళనాడు స్టేట్ లో ఆల్ టైం నెంబర్ 1 గ్రాస్ సాధించిన సినిమా గా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది విక్రమ్..దశావతారం తర్వాత సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి ఈ సినిమా కేవలం హీరో గా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

