Vikram: హీరో విక్రమ్ అంటే 15 ఏళ్ల క్రితం విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. విక్రమ్ సినిమా వస్తోంది అంటే.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. పైగా విక్రమ్ కి అభిమానులు పీక్స్ లో ఉండేవారు. ఆ రోజుల్లో సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో కూడా విక్రమ్ మాత్రమే. విక్రమ్ నుంచి వచ్చిన ‘శివపుత్రుడు’ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అరె.. ఒక హీరో ఇలా కూడా నటించొచ్చా ? అని ఆశ్చర్యపోయారు ఆ సినిమా చూసి.

అంత గొప్పగా విక్రమ్ నటించాడు ఆ సినిమాలో. ఆ తర్వాత ‘అపరిచితుడు’ సినిమా విక్రమ్ స్థాయిని మరింతగా పెంచింది. ఆ రెండు చిత్రాలతో తెలుగునాట కూడ విక్రమ్ కి భారీఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. తనకు సడెన్ గా వచ్చిన ఆ క్రేజ్ ను చూసి విక్రమ్ కూడా షాక్ అవుతూ ఉండేవాడు. అయితే, కాలం ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు కదా. మారుతూ ఉంటుంది. ఆ మారే క్రమంలో ఎన్నో మారతాయి.
Also Read: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. ‘వాసి వాడి తస్సదియ్యా’..!
విక్రమ్ పాలోయింగ్ విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. గట్టిగా పదేళ్ల పాటు విక్రమ్ హవా నడిచింది, కానీ, ప్రస్తుతం విక్రమ్ పని అయిపోయింది అంటున్నారు, ‘ఐ మనోహరుడు’ సినిమాల తర్వాత విక్రమ్ కి ఉన్న మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య విక్రమ్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడలేదు. తమిళనాట కూడా విక్రమ్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయిందని అక్కడి సినీ పండితులు చెబుతున్నారు.
విక్రమ్ వయసు కూడా పెరిగింది, ఇక విక్రమ్ కి ఎలాగూ ఈ మధ్య కాలంలో హిట్ లేదు. పైగా విక్రమ్ కొడుకు ధృవ్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క విక్రమ్ కూడా హీరోగా సినిమాలను తగ్గించుకుంటూ వస్తున్నాడు. తాజాగా కొడుకు ధృవ్ తో కలిసి ‘మహాన్’ అనే సినిమాలో నటించాడు. అయితే, ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. చివరకు పరిస్థితి ఎలా వచ్చింది అంటే.. విక్రమ్ సినిమాను భారీ మొత్తానికి కొనే పరిస్థితి కూడా లేదట. అందుకే ‘మహాన్’ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఒక స్టార్ హీరోకి ఇది అవమానకర పరిస్థితే.
Also Read: ఏపీ సర్కారుపై ట్వీట్ వార్ మొదలెట్టిన వర్మ.. గంటలో ఇన్ని ట్వీట్లా..