Vikram 15 Days Collectons: విశ్వరూపం పార్ట్ 2 డిజాస్టర్ ఫ్లాప్ అయిన తర్వాత సుమారు నాలుగేళ్లు వెండితెర కి దూరమైనా కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో తీసిన విక్రమ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..దశావతారం సినిమా తర్వాత తన రేంజ్ కి తగ్గ బ్లాక్ బస్టర్ హిట్ లేక కెరీర్ ముగిసిపోతున్న సమయం లో కమల్ హాసన్ విక్రమ్ సినిమా తో ప్రతి ఒక్కరికి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏమిటో మరోసారి అర్థం అయ్యేలా చేసాడు..ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు ప్రతి రోజు ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి..ఇటీవలే ఈ సినిమా ప్రతిష్టాత్మక 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోగా..ఈ వీకెండ్ తో 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటనుంది..క్లోసింగ్ వసూళ్లు ఇప్పట్లో పడే అవకాశం కనిపించకపోవడం తో ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా ఈ సినిమా అందుకునే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఒక్క తమిళం లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ , కన్నడ మరియు మలయాళం బాషలలో కూడా ఈ సినిమా ఇప్పటికి అద్భుతమైన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.
Also Read: Agneepath Scheme Protest: ‘అగ్ని’కి ఆజ్యం పోస్తున్నదెవరు.. దేశమంతా ఎందుకీ నిరసనలు
ఇక తమిళనాడు రాష్ట్రం లో అయితే ఈ సినిమా రాబొయ్యే రెండు మూడు రోజుల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని అందుకోబోతుంది..ఇప్పటి వరుకు ఇక్కడ 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి బాహుబలి 2 మొదటి స్థానం లో కొనసాగుతూ ఉన్నింది..ఇక ఆ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమా 140 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని టాప్ 2 స్థానం లో ఉన్నింది..ఈ రెండు సినిమాల రికార్డ్స్ ని ఇప్పటి వరుకు ఆ ప్రాంతం లో ఏ సినిమా ముట్టుకోలేదు..అంతటి కష్టమైన రికార్డ్స్ ని విక్రమ్ సినిమా అతి తేలికగా అందుకొని విశ్వాసం సినిమా కలెక్షన్స్ ని దాటేసింది..ఇక ఈ ఆదివారం తో బాహుబలి 2 వసూళ్లను కూడా అధిగమించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతుంది విక్రమ్..ఇక తెలుగు లో కూడా ఈ సినిమా తో కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉగ్ర రూపం చూపించాడు అనే చెప్పాలి..ఈ సినిమా తెలుగు హక్కులను హీరో నితిన్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా కేవలం 15 రోజుల్లోనే ఈ సినిమా ఇక్కడ 15 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..అంటే పెట్టిన ప్రతి పైసాకి దాదాపుగా మూడింతలు ఎక్కువ వసూలు చేసిందది అన్నమాట..ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ నుండి 17 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: Pawan Kalyan Says No To Thaman: థమన్ కి ‘నో’ చెప్పిన పవన్ కళ్యాణ్