Jabardasth Comedian Ram Prasad: చివరికి ఆ కమెడియనే రామ్ ప్రసాద్ కి గతి అయ్యాడు!

Jabardasth Comedian Ram Prasad: జబర్దస్త్ పూర్తిగా కళ కోల్పోయింది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను షో మానేయగా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జబర్దస్త్ షోకి వస్తున్న తాజా టీఆర్పీనే ఇందుకు నిదర్శనం. చమ్మక్ చంద్ర, అదిరే అభి, ముక్కు అవినాష్ వంటి సీనియర్స్ చాలా కాలం క్రితమే జబర్దస్త్ వదిలేశారు. కొన్ని టీమ్స్ మినహాయిస్తే దాదాపు కొత్తవారు జబర్దస్త్ లోకి రావడం జరిగింది. ఎందరు వెళ్ళిపోయినా ఆటో రామ్ ప్రసాద్ […]

Written By: Shiva, Updated On : June 18, 2022 2:57 pm
Follow us on

Jabardasth Comedian Ram Prasad: జబర్దస్త్ పూర్తిగా కళ కోల్పోయింది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను షో మానేయగా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జబర్దస్త్ షోకి వస్తున్న తాజా టీఆర్పీనే ఇందుకు నిదర్శనం. చమ్మక్ చంద్ర, అదిరే అభి, ముక్కు అవినాష్ వంటి సీనియర్స్ చాలా కాలం క్రితమే జబర్దస్త్ వదిలేశారు. కొన్ని టీమ్స్ మినహాయిస్తే దాదాపు కొత్తవారు జబర్దస్త్ లోకి రావడం జరిగింది.

Jabardasth Comedian Ram Prasad

ఎందరు వెళ్ళిపోయినా ఆటో రామ్ ప్రసాద్ జబర్దస్త్ షోని వదలడం లేదు. సుధీర్ మానేయడంతో తాను టీం లీడర్ గా మారాడు. నిజానికి సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆ ముగ్గురు టీం లీడర్స్ అని చెప్పాలి. సుధీర్ పేరున టీం ఉన్నప్పటికీ మిత్రులుగా ముగ్గురికీ ఆధిపత్యం ఉండేది. ప్రస్తుతం ఆ టీమ్ లో మిగిలింది రామ్ ప్రసాద్ మాత్రమే. అయితే సుడిగాలి సుధీర్ టీమ్ లో చాలా కాలం కొనసాగిన కమెడియన్ సన్నీ. స్కిట్ లో సన్నీ ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కనీసం రెండు మూడు పంచ్లు కూడా రామ్ ప్రసాద్ సన్నీకి రాసేవాడు కాదు. ఏదో వచ్చిపోయాడు అన్నట్లు సన్నీ రోల్స్ ఉండేవి.

Also Read: Vikram 15 Days Collectons: విక్రమ్ ’15’ రోజుల వసూళ్లు

స్కిట్ మొత్తం రామ్ ప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను నడిపించేవాడు. అయినప్పటికీ సన్నీ వాళ్ళ టీమ్ ని వదల్లేదు. కొన్నాళ్లుగా అతడు కూడా కనిపించడం మానేశాడు. తాజాగా సన్నీ రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ టీం లో అతడు సందడి చేయనున్నాడు. విడుదలైన ప్రోమో ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. రామ్ ప్రసాద్ కోరి సన్నీని తెచ్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. సుధీర్, గెటప్ శ్రీను ఉన్నప్పుడు సన్నీ అవసరం రామ్ ప్రసాద్ కి రాలేదు. ఇప్పుడు తప్పకపోవడంతో సన్నీని తెచ్చుకున్నాడు.

Sunny

సన్నీ సైతం జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకడు. చక్కని కామెడీ టైమింగ్ ఉన్నవాడు. పలు చిత్రాల్లో కూడా కామెడీ రోల్స్ చేశాడు. కనీసం సన్నీ రాకతో ఆటో రామ్ ప్రసాద్ కి ఒంటరినన్న ఫీలింగ్ పోతుందేమో చూడాలి. ఆటో రామ్ ప్రసాద్ తో సుధీర్, గెటప్ శ్రీను కాంబినేషన్ ఎవరూ రీప్లేస్ చేయలేనిది. అయితే సన్నీ రీ ఎంట్రీ రామ్ ప్రసాద్ కి ప్లస్ అవుతుంది. మరి చూడాలి వీరిద్దరి స్కిట్స్ ఎంత మేర నవ్వులు పూయిస్తాయో. ఇక ఈటీవీని పూర్తిగా వదిలేసిన సుధీర్ స్టార్ మాతో పాటు ఇతర ఛానల్స్ లో బిజీ అవుతున్నాడు. మరోవైపు హీరోగా చిత్రాలు చేస్తున్నాడు.

Also Read:Bandla Ganesh: బండ్ల గణేష్ కు ఏమైంది? ఆడియో లీక్.. ఇంట్లో వాళ్లకు అన్యాయం చేశాడా?

Tags