Vikas Sethi: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలీవుడ్ దిగ్గజ నటుడు…

సినిమా ఇండస్ట్రీలో ఉండే నటులకు పర్సనల్ లైఫ్ లో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్క్రీన్ మీద మాత్రం వాళ్ళు మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. అలాంటి నటులు తమ బాధని సైతం దిగమింగుతూ ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకులను ఎన్టీయార్ టైన్ చేయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటారు...

Written By: Gopi, Updated On : September 9, 2024 1:08 pm

Vikas Sethi

Follow us on

Vikas Sethi: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా సినిమాలు సక్సెస్ అవ్వడం లేదనే విషయం మనకు తెలిసిందే…ఇక ప్రస్తుతం బుల్లితెర మీద ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వికాస్ సేదీ ఆదివారం రోజున గుండెపోటుతో మరణించడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. 48 ఏళ్ల వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తన కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీ అలాగే బుల్లితెర ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి… నిజానికి వికాస్ సేది చాలా మంచి పాత్రలను పోషిస్తూ బుల్లితెర అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే వెండి తెర మీద కూడా ఆయన తీసిన కొన్ని పాత్రలు అద్భుతంగా నిలిచాయనే చెప్పాలి. ముఖ్యంగా ‘కబీ కుష్ కభీ కమ్’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చిన్నదైనప్పటికీ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ఆ పాత్ర గుర్తుండిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన పోషించిన పాత్ర సగటు ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా ఆ సినిమా సక్సెస్ లో కూడా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. 2001 లో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ లో తను చాలావరకు ముఖ్య భూమిక పోషించాడు.

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి ఆయనకు సినిమా ఇండస్ట్రీలో అంతగా బ్రేక్ అయితే లభించలేదు. కాబట్టి బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తూ యావత్ ప్రేక్షకు లోకాన్ని అలరించాడు… ఇక ముఖ్యంగా కబీ కుష్ కబీ కమ్ సినిమాలోనే ఆయన మొదటి సారి రాబీ పాత్రలో నటించి హృతిక్ రోషన్ కి సైతం పోటీ ఇచ్చాడు. ఒక నటుడు ఎంత బాగా నటిస్తాడు అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిన పనిలేదు. అతను నటించిన ఇక సీన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి వికాస్ సేది నటన ప్రతిభ తెలిసింది మాత్రం కబీ కష్ కబీ కమ్ మూవీ తోనే కావడం విశేషం…

ప్రస్తుతం ఇలాంటి నటుడిని కోల్పోవడం అనేది చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద లోటనే చెప్పాలి. ఇతని మరణం పట్ల ప్రముఖ హీరోలు సైతం వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నారు…ఇక మొత్తానికైతే ఆయన పోషించిన రాబీ పాత్ర మాత్రం ఎప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చిరస్మరణీయమైన పాత్రగా గుర్తుండిపోతుందనే చెప్పాలి.