Homeఅప్ కమింగ్ మూవీస్Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పాన్ ఇండియా కథని సిద్ధం చేసిన...

Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పాన్ ఇండియా కథని సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్.. స్టోరీ లైన్ అదిరిపోయింది

power star pawan kalyan:  ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి బాహుబలి, బజరంగీ భాయ్ జాన్ మరియు #RRR వంటి సినిమాలను ఈరోజు మనం చూసి ఆనందిస్తున్నాము అంటే దానికి కారణం విజయేంద్ర ప్రసాద్ గారు..ఈయన అందించిన అద్భుతమైన కథల వల్లే ఆ సినిమాలు ఆ స్థాయిలో సంచలన విజయాలు సాధించాయి..ఈ సినిమాలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి..ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరు మన భారత దేశ సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసాయి..ఇంతతి ఘన కీర్తి ప్రతిష్టలు మన ఇండియన్ సినిమాకి రప్పించేందుకు ప్రధాన పాత్ర వహించారు కాబట్టే విజయేంద్ర ప్రసాద్ గారిని రాజ్య సభ కి ఎంపిక చేసి అరుదైన గౌరవం దక్కేలా చేసింది కేంద్ర ప్రభుత్వం..ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమా కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం అని తెలుస్తుంది..ఈ ఏడాది లోపు సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది లో సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రయత్నిసున్నారు అట.

power star pawan kalyan:
power star pawan kalyan:

Also Read: Hero Nani: హీరో నానికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. శోకసంద్రంలో ఫ్యాన్స్

ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేసినట్టు గత కొద్దీ రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ కథని తన కొడుకు రాజమౌళి దర్శకత్వం లో తియ్యించాలి అనేది విజయేంద్ర ప్రసాద్ కోరిక అట..స్వతంత్రం రాకముందు ఆంగ్లేయుల పాలనలో సన్యాసుల తిరుగుబాటు నేపథ్యం లో ఈ కథ సాగుతుంది అట..బెంగాలీ లో వచ్చిన ‘ఆనంద మటం’ అనే నవలని ఆధారంగా తీసుకొని ఈ కథని ఎంతో గొప్ప గా రూపొందించారట విజయేంద్ర ప్రసాద్..ఈ కథ ఆయన డ్రీం ప్రాజెక్ట్..విప్లవ భావాలున్న పవన్ కళ్యాణ్ వంటి హీరోలు మాత్రమే ఈ కథకి న్యాయం చెయ్యగలరు అనేది విజయేంద్ర ప్రసాద్ భావన..

power star pawan kalyan:
power star pawan kalyan:

Also Read: Jabardasth New Anchor: జబర్దస్త్ కొత్త యాంకర్ ని చూసి షాక్.. ఊహకు అందని ట్విస్ట్ ఇది.. అసలేం జరిగింది ?

విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్ఫాన్ అనే విషయం మన అందరికి తెలిసిందే..బాహుబలి 2 ఇంటర్వెల్ సన్నివేశం ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొనే చేశాను అని గతం లో చాలా సార్లు తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ఉంది కాబట్టి ఈ కథని కూడా చాలా గొప్పగా తీర్చి దిద్ది ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు..అయితే ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తాడా..లేదా వేరే డైరెక్టర్ తీస్తాడా అనేది ఇంకా ఖరారు కాలేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version