తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంటుంది. అందుకే.. ఆయనతో సినిమాలు చేయడానికి మేకర్స్ ఎగబడుతుంటారు. అయితే.. ఫ్యాన్స్ చేస్తున్న కంప్లయింట్ ఏమంటే.. ఎవరెవరో దర్శకులకు, కథకులకు ఛాన్స్ ఇస్తుంటారని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ బిగ్ బ్రేకింగ్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది!
అగ్రశ్రేణి కథా రచయిత విజయేంద్రప్రసాద్ పవన్ కోసం ఓ కథ రాస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు కథలు అందించేంది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే. ఆయన అందించే అద్భుతమైన కథలను.. అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ సెల్యులాయిడ్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి.
Also Read: మళ్లీ కలిసిన స్నేహితులు.. ఒకే వేదికపై పవన్ – అలీ!
విజయేంద్ర ప్రసాద్ పెన్ పవర్ ఏంటన్నది ఆయన గత సినిమాలే చెబుతాయి. మగధీర, బాహుబలి లాంటి వీరోచిత గాధలను ఊహించగలరు.. భజరంగీ భాయ్ జాన్ వంటి సున్నితమైన కథను కూడా ఆవిష్కరించగలరు. ఆ విధంగా ఎన్నో అద్భుతమైన కథలు అందించి, రాజమౌళి జైత్రయాత్రలో ప్రధాన భాగంగా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు పవన్ కోసం ఓ కథను అందించేందుకు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
Also Read: థియేటర్లో ‘ఆ నలుగురు!’.. మరి, దమ్ము చూపిందెవరో తెలుసా..?
దీన్ని విశ్వసించడానికి కూడా కారణాలున్నాయి. పవన్ పై విజయేంద్ర ప్రసాద్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. బాహుబలి ఇంట్రవెల్ సీన్‌కి.. పవన్ కల్యాణే స్ఫూర్తి అని మీడియా సాక్షిగా వివరించారు విజయేంద్ర ప్రసాద్. అలాంటి ఆయన ఇప్పుడు పవన్ కోసం కథ రాస్తున్నారని తెలియడంతో.. ఎలాంటి స్టోరీని సిద్ధం చేస్తున్నారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కాగా.. ఈ స్టోరీ విషయమే కుదుపు కుదిపేయగా.. దీనికి దర్శకుడు ఎవరు? అన్న ప్రశ్న మరింత సంచలనంగా మారింది. సాధారణంగా విజయేంద్రప్రసాద్ కథలన్నీ రాజమౌళి తెరకెక్కిస్తుంటారు. అయితే.. కొన్ని కథలు బయటి దర్శకులు కూడా అందుకున్నారు. మరి, ఇప్పుడు పవన్ కోసం రాసే కథను వేరే దర్శకులు టేకప్ చేస్తారా..? లేక రాజమౌళి మాత్రమే తెరకెక్కిస్తారా? అన్నది అత్యంత క్యూరియాసిటీగా మారింది. ఒకవేళ రాజమౌళి దర్శకత్వంవహిస్తే మాత్రం అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రేక్షకుల ఊహకే వదిలేయాలి.