Homeఎంటర్టైన్మెంట్Razakar Files Movie: త్వరలో ‘రజాకార్‌ ఫైల్స్‌’.. తెలంగాణ ఎన్నికల వేళ ‘తెర’పైకి!

Razakar Files Movie: త్వరలో ‘రజాకార్‌ ఫైల్స్‌’.. తెలంగాణ ఎన్నికల వేళ ‘తెర’పైకి!

Razakar Files Movie: టీబీజేపీకి కొత్త చరిష్మా తేవటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీద చేసే పోరు విషయంలో బండి సమర్థత సరిపోలేదన్న మాట వినిపిస్తుంది. అన్నింటికి మించిన ఆయన మాటతీరే ఆయనకు పెద్ద ప్లస్‌.. అంతే పెద్ద మైనస్‌ అన్న విమర్శ పలువురు బీజేపీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి బలం చేకూరేలా.. అధికార బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చేలా ఎన్నికల నాటకి సినిమా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. గతంలో బండి సంజయ్‌ చెప్పినట్లుగా రజాకార్‌ ఫైల్స్‌ సినిమానే ఎన్నికలనాటికి తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే కథ, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం.

సినిమాలపై కేసీఆర్‌ విమర్శలు..
‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ నిర్వహించిన ఆర్మీ గురించి దేశప్రజలకు వివరించేందుకు తీసిన యూరీ సినిమాపైనా, కశ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్‌ఫైల్స్‌ పైనా టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రెస్‌మీట్‌లో కశ్మీర్‌ఫైల్స్‌ సినిమాపై విమర్శలు చేశారు. ఎకనామిక్స్‌ ఫైల్స్, డెవలప్‌మెంట్‌ ఫైల్స్‌ కావాలని కానీ, కశ్మీర్‌ఫైల్స్‌ ఎవరి కోసం అని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ సినిమాలు విడుదల చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘త్వరలో రజాకార్‌ ఫైల్స్‌ తీస్తాం. అందులో కేసీఆర్‌.. కేటీఆర్‌ల చరిత్ర కూడా పెడతాం’ అని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. .

విజయేంద్రప్రసాద్‌ కథ..
తెలుగు సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు బీజేపీ ఇటీవల రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో రజాకార్‌ ఫైల్స్‌ కథ విజయేంద్ర ప్రసాద్‌తో రాయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాశ్మీర్‌ ఫైల్స్‌ బాగా భావోద్వేగాలను పెంచిందని.. ఆ తరహాలోనే సినిమా ఉండాలని బండి సంజయ్‌ భావిస్తున్నారు. తెలంగాణలో జరిగిన రజాకార్ల అఘాయిత్యాలకు సంబంధంచి ‘రజాకార్‌ ఫైల్స్‌’ అనే సినిమా కథను రెడీ చేస్తున్నారని సమాచారం.

దసరా నాటికి విడుదల..
కశ్మీరీ పండిట్ల జీవితాలను తెరపైకి తెచ్చినట్లేం రజాకార్ల దారుణాలను ప్రజలకు చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కశ్మీరీ ఫైల్స్‌ లాగే రజాకార్ల ఫైల్స్‌ ను తెరపై చూపించేలా ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దసరా నాటికి రజాకార్ల ఫైల్స్‌ చిత్రాన్ని విడుదల చేసేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్ల తెలుస్తోంది.

వివాదాలతో సక్సెస్‌..
వివాదాస్పద అంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు విజయం సాధిస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా వచ్చిన యూరీ, కశ్మీరీఫైల్స్‌ విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీస్‌ సినిమా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఉగ్రవాదుల నేపథ్యంతో తెరకెక్కిన సినిమా పాన్‌ ఇండియాలో గ్రేట్‌ విక్టరీ అందుకుంది. సిసలైన పాన్‌ ఇండియా సినిమా అంటే ఇది అంటూ ఆర్జీవీ కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో రజాకార్‌ ఫైల్స్‌ సినిమాపై మళ్లీ చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరాకు తెలంగాణ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version