Husband murder: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మూడు ముళ్ల బంధం.. ఏడడుగుల సంబంధం చక్కని సంసారం… కలతలు లేని కాపురం కానీ ఎందుకో వారిలో కోరికలు చెలరేగాయి. భర్తలను వదిలి ప్రియుడి మోజులో పడింది. తమ సుఖానికి అడ్డు వస్తున్నాడనే సాకుతో తుద ముట్టించాలని భావించారు. దానికి సరైన ప్రణాళిక వేసుకున్నారు. అదను కోసం ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో భర్త, ప్రియుడు ఇద్దరు కలిసి మద్యం తాగి మత్తులో జోగడంతో ఇదే సరైన సమయం అని గ్రహించి ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించింది. […]

Written By: Srinivas, Updated On : August 15, 2021 12:11 pm
Follow us on

మూడు ముళ్ల బంధం.. ఏడడుగుల సంబంధం చక్కని సంసారం… కలతలు లేని కాపురం కానీ ఎందుకో వారిలో కోరికలు చెలరేగాయి. భర్తలను వదిలి ప్రియుడి మోజులో పడింది. తమ సుఖానికి అడ్డు వస్తున్నాడనే సాకుతో తుద ముట్టించాలని భావించారు. దానికి సరైన ప్రణాళిక వేసుకున్నారు. అదను కోసం ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో భర్త, ప్రియుడు ఇద్దరు కలిసి మద్యం తాగి మత్తులో జోగడంతో ఇదే సరైన సమయం అని గ్రహించి ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించింది. పోలీసులు కూపీ లాగడంతో అసలు నిజాలు వెలుగుచూశాయి.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన చౌహాన్ ప్రఫూన్ (29) ఆటో డ్రైవర్ తన భార్య జ్యోతితో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అనే మరో ఆటో డ్రైవర్ తో సన్నిహితంగా ఉండేవాడు. తరచూ ఇంటికి వచ్చే కృష్ణకు చౌహాన్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ సుఖానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో చౌహాన్ ను అంతమొందించాలని పథకం పన్నారు. మే 6న కృష్ణ, చౌహాన్ కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో మత్తులో ఉన్న చౌహాన్ ను జ్యోతి ప్రియుడు కృష్ణతో కలిసి హత్య చేసింది. అనంతరం శవాన్ని గోనెసంచిలో మూటకట్టి అదే రోజు రాత్రి చౌహాన్ మృతదేహాన్ని ఆటోలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం-తంగళ్లపల్లి గుట్లల్లో పాతిపెట్టి నగరానికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లుగా నటిస్తూ తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతి కాల్ లిస్ట్ ఆధారంగా భార్య జ్యోతి హంతకురాలని తేల్చారు. పోలీసులు జ్యోతిని విచారించగా ప్రియుడితో కలిసి అంతమొందించినట్లు నిర్ధారణ అయింది. శనివారం మధ్యాహ్నం నిందితులిద్దరిని శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ మృతదేహం గోనెసంచి, ఇతర ఆనవాళ్లు లభ్యమయ్యాయి. బొల్లారం సీఐ ప్రశాంత్, కోహెడ తహసీల్దార్ రుక్మిణి సమక్షంలో చౌహాన్ మృతదేహానకి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.