
తమిళ స్టార్ హీరో విజయ్ కి ఇపుడు కొత్త దిగులు పట్టుకొంది . ఆయన బాధపడుతోంది విడుదల కాకుండా ఆగిపోయిన మాస్టర్ సినిమా గురించి కాదు . కెనడాలో ఇరుక్కుపోయిన కొడుకు గురించి ….ఇంతకీ ఏమి జరిగిందంటే విజయ్ కొడుకు జేసన్ సంజయ్ కెనడా లోని ఒక ప్రముఖ యూనివర్సిటీ లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చు కొంటున్నాడు.
ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న కెనడాలో వైరస్ పీడితులు అధికంగానే ఉన్నారు. అలాంటి సమయం లో కొడుకు జేసన్ సంజయ్ ఒంటరిగా కెనడాలో ఇరుక్కుపోవడం తనకు ఒకింత భాదగా ఉందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ దగ్గర తన భాదను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది .కాకపొతే కొడుకు జేసన్ సంజయ్ ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేకపోవడం విజయ్ కి కొండంత ఊరట. కాగా 20 ఏళ్ళ జేసన్ సంజయ్ ఇంతవరకు ఒకే ఒక్కషార్ట్ ఫిలిం తీయడం జరిగింది .ఇక కెనడా లోని ఫిలిం మేకింగ్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చి సినిమా డైరెక్టర్ గా సెటిల్ కావాలన్నది జేసన్ సంజయ్ కోరిక అని తెలుస్తోంది.
అదలా ఉంటే యువ దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా తమిళ ఉగాది ని పురస్కరించుకొని పోయిన వారం విడుదల కావాల్సి ఉంది .కరోనా దెబ్బకి వాయిదా పడింది. కార్తీ నటించిన ఖైదీ సినిమా తీసి సూపర్ సక్సెస్ అందుకొన్న కార్తీక్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్టర్ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి.