Homeఎంటర్టైన్మెంట్లాక్ డౌన్ చాలా బాగుంది అంటున్న హీరోయిన్

లాక్ డౌన్ చాలా బాగుంది అంటున్న హీరోయిన్

ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టే వేరే దారి అన్నట్టుగా వుంది ఈ వైజాగ్ నటి పరిస్థితి . 2013 లో వచ్చిన `అలియాస్ జానకి ` చిత్రం తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అనిషా అంబ్రోస్ కరోనా లాక్ డౌన్ తన కెంతో బాగుందని మురిసిపోతోంది. ఆమె అలా ఆనంద పడటానికి బలమైన కారణం వుంది . తెలుగులో గోపాల గోపాల , రన్ , మనమంతా , ఈ నగరానికి ఏమైంది , ఫ్యాషన్ డిజైనర్ సన్ అఫ్ లేడీస్ టైలర్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన అనిషా అంబ్రోస్ గత సంవత్సరం మే లో జక్కా గుణ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. హైదరాబాద్ లో ప్రాపర్టీ మానెజ్మెంట్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గుణ , అనిషా దంపతులకు త్వరలో ఒక బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు ప్రస్తుతం ఐదో నెల గర్భం తో ఉన్న అనిషా అంబ్రోస్ ఆగష్టు లో తల్లి కాబోతుంది. అలాంటి ఆనంద సమయంలో లాక్ డౌన్ పుణ్యమా అని భర్త గుణ తన తోనే ఉండటం తనకెంతో ఆనందం గా ఉందని అనిషా అంబ్రోస్ పేర్కొంది.

వచ్చే ఆగస్టు లో తల్లి కాబోతున్న అనిషా అంబ్రోస్ మరో కారణం తో కూడా ఆనందం గా ఉంది. ఇకనుంచి ప్రతి ఆగస్టు లో తనతో పాటు, తనకు పుట్టబోయే బిడ్డకు కూడా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని మురిసిపోతూ చెప్పింది. బిడ్డని కనే సమయంలో వైజాగ్ లో ఉన్న తల్లి తండ్రుల వద్దకు వెళ్లాలని ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లడం కుదరడం లేదని చెప్తూ , అయినా తనని భర్త గుణ, అత్తా మామలు బాగా చూసుకొంటున్నారని చెప్పింది. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎలా వచ్చాయంటే అనిషా ఫ్రెండ్ , బిగ్ బాస్ బ్యూటీ అయిన తేజస్వి మదివాడ అనిషా ఆంబ్రోస్ కి చెందిన పెర్సనల్ ఫోటో ఒకటి బయటికి తీసి లోకానికి ఈ విషయాలన్నీ తెలిసేలా చేసింది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular