https://oktelugu.com/

ముదురుతున్న విజయ్ వర్సెస్ వెబ్ సైట్స్ వివాదం

ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ దేవరకొండ వర్సస్ వెబ్ సైట్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ తనపై కొన్ని వెబ్ సైట్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెల్సిందే. #Kill Fake News పేరిట విజయ్ చేపట్టిన పోరాటానికి మద్దతుగా టాలీవుడ్ నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, […]

Written By: , Updated On : May 6, 2020 / 01:43 PM IST
Follow us on


ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ దేవరకొండ వర్సస్ వెబ్ సైట్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ తనపై కొన్ని వెబ్ సైట్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెల్సిందే. #Kill Fake News పేరిట విజయ్ చేపట్టిన పోరాటానికి మద్దతుగా టాలీవుడ్ నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజ తదితర హీరోహీరోయిన్లు, నిర్మాతలు విజయ్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

నెలాఖరి వరకు లాక్ డౌన్:కేసీఆర్

విజయ్ వర్షన్లో అతడి ఆవేదన ఉన్నప్పటికీ ఆయన విడుదల చేసిన వీడియోలో వెబ్ సైట్స్ పై చాలా చులకనభావంతో మాట్లాడారు. 100 రూపాయలు పెట్టి డోమెన్ కొని ఓ రెండువేలతో హోస్టింగ్ తీసుకొని ఎవరైనా వెబ్ సైట్స్ పెట్టొచ్చంటూ ఉచిత సలహాలు ఇచ్చేశారు. తమ సినిమాలపై బ్రతికే వెబ్ సైట్స్ తామనే టార్గెట్ చేస్తున్నాయని.. తాను ఇంటర్వ్యూ ఇవ్వలేదనే కారణంతో కొన్ని వెబ్ సైట్స్ తనపై తప్పుడు ప్రచారానికి తెరలేపాయని ఆరోపించారు. ఈ వెబ్ సైట్స్ కు తాము సినిమా యాడ్స్ ఇవ్వాలని.. ఇంటర్వ్యూలు ఇవ్వాలి.. ఇవ్వకపోతే ఇలా తప్పుడు ప్రచారాలను చేస్తారని వీడియోలో చెప్పారు. ఏదోఒక వెబ్ సైట్ పెట్టి ఈజీగా తమపై మనీ సంపాదిస్తున్నారనే రీతిలో ఆయన మాటలు కన్పించాయి. మొత్తంగా తనపై తప్పుడు ప్రచారం చేశారనే అక్కసుతో జనాల్లో వెబ్ సైట్స్ అంటే చులకన భావం కన్పించేలా విజయ్ వీడియో సందేశం కన్పించింది.

మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

దీనిపై కొన్ని వెట్ సెట్స్ కూడా విజయ్ పై అంతే ఘాటుగా స్పందిస్తున్నాయి. #Kill Fake News అంటే మీ సినిమాలకు భజన చేయడమేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి. మీరు తీసే సినిమాలు బాగుంటే బాగుందని.. లేకపోతే లేదని చెబితే సీని పెద్దలకు కోపం వస్తుందని అంటున్నారు. సినిమాలు బాగా తీయండని చెబితే తమను వెబ్ సైట్స్ టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు చేయడం వారికే చెల్లిందంటున్నాయి. సినిమా ప్రమోషన్లకు వెబ్ సైట్స్ కావాలి కానీ.. విమర్శిస్తే మాత్రం ఒప్పుకోరని ఇదేక్కడి పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నాయి. ప్లాప్ అయిన సినిమాలు కూడా బాగా కలెక్షన్లు సాధించాయని, బంపర్ హిట్టు సాధించాయని ప్రేక్షకులకు ఫేక్ కలెక్షన్లు చూపెట్టడం అభిమానులను మోసం చేయడం కాదా? ఇలాంటి ఫేక్ న్యూస్ కాదా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!

#Kill Fake News మాదిరిగానే #Kill Fake Collections చేపడితే బాగుంటుందని వెబ్ సైట్స్ హితవు ప పలుకుతున్నాయి. ఏదోఒక వెబ్ సైట్ చేసిన తప్పుడు ప్రచారానికి అన్ని వెబ్ సైట్లను ఒక్కగాడికి కట్టడం.. దానికి #Kill Fake News అంటూ పేరిట టాలీవుడ్ ఏకం కావడం విచిత్రంగా మారింది. వెబ్ సైట్లను బ్యాన్ చేసే ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నట్లు కన్పిస్తుంది. ఇలా విమర్శించే ప్రతీఒక్కరిని బ్యాన్ చేసుకుంటూ పోతే చివరికీ వాళ్ల సినిమాలను వాళ్లే చూసే రోజులే వస్తాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విమర్శలను పాజిటివ్ కోణంలో తీసుకోవాలే తప్ప.. కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే అంతిమంగా నష్టపోయేది వారేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం మున్మందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!