Vijay Swearing In Cancelled: తమిళనాడు లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయం లో విజయ్(Thalapathy Vijay) కి గవర్నర్ నుండి చుక్కెదురు అవ్వడం ఇప్పుడు మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. నేడు మధ్యాహ్నం ఆయన గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిని కోరారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ టీవీకే కి లేదు. 107 స్థానాల్లో విజయ్ సాధించిన టీవీకే పార్టీ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలు కి కేవలం 5 సీట్లు మాత్రమే ఎన్నికల్లో వచ్చాయి. ఆ 5 సీట్లు కలిపితే విజయ్ టీవీకే కి 112 సీట్లు అయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాలంటే మరో 6 సీట్లు కావాలి, మొత్తం మీద 118 సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. కానీ విజయ్ కేవలం 112 స్థానాలతో గవర్నర్ ముందుకు వెళ్లడంతో, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు.
దీంతో రేపు నెహ్రు స్టేడియం లో ఏర్పాటు చేసిన విజయ్ ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇప్పటికే 5 వేల మందికి పైగా అభిమానులకు పాసులు ఇచ్చేసారు. కానీ చివరి నిమిషం లో గవర్నర్ నుండి ఈ ట్విస్ట్ రావడంతో అందరూ ఒక్కసారి గా షాక్ కి గురయ్యారు. విజయ్ కాంగ్రెస్ పార్టీ తో సహా , సిపిఐ , సిపిఎం , పీఎంకే, ఏఐఏఎం పార్టీల మద్దతు కోరాడు. కాంగ్రెస్ పార్టీ విజయ్ తో కలవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, మిగిలిన నాలుగు పార్టీలు మాత్రం అనుమతిని నిరాకరించాయి. తాము డీఎంకే పొత్తులోనే ఉంటామని. తేల్చి చెప్పాయి. గవర్నర్ కి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం విజయ్ చేయగా , అందుకు గవర్నర్ సంతృప్తి చెందలేదని , అందుకే ప్రభుత్వ ఏర్పాటు కి ఒప్పుకోలేదని అంటున్నారు.
మరి ఇప్పుడు విజయ్ తక్షణ కర్తవ్యం ఏంటి?, AIDMK తో పొత్తు పెట్టుకుంటాడా?, మరి ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా, AIDMK తో ప్రస్తుతం బీజేపీ ఉంది, కేంద్రం లో అధికారం ఉన్నటువంటి బీజేపీ ని వదిలి విజయ్ తో జతకట్టే సాహసం AIDMK చేస్తుందా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న సందేహం. ఇప్పుడు విజయ్ ముందు ఉన్న ఛాయస్ ఒక్కటే , DMK మరియు AIDMK పార్టీల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపించి టీవీకే లోకి ఆహ్వానిస్తే తప్ప, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులే కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే ఎంతో ఆసక్తికరంగా మారాయి.