https://oktelugu.com/

Maharaja Movie: నెట్ ఫ్లిక్స్ లో 100 రోజుల నుండి ట్రెండ్ అవుతున్న విజయ్ సేతుపతి ‘మహారాజ’ చిత్రం..ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా?

ఈ చిత్రం విజయ్ సేతుపతి 50 వ చిత్రం గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళం భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం తమిళ వెర్షన్ లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఈ ఏడాది జులై 12 వ తారీఖున విడుదల అయ్యింది. అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమా టాప్ 10 లో కొనసాగుతూనే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 05:37 PM IST
    Follow us on

    Maharaja Movie: సౌత్ ఇండియాలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే హీరోలలో ఒకరు విజయ్ సేతుపతి. నేటి తరం లో ఎలాంటి క్యారక్టర్ ని అయినా అవలీలగా పోషించగలను అని నిరూపించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకరు ఆయన. కెరీర్ లో వరుస సూపర్ హిట్స్ వస్తున్న సమయంలో నెగటివ్ రోల్ చేసే సాహసం ఏ హీరో కూడా చేయడు, కానీ విజయ్ సేతుపతి చేసాడు. పేట సినిమాలో నెగటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి, ఆ తర్వాత మాస్టర్, ఉప్పెన మరియు జవాన్ చిత్రాలలో నెగటివ్ రోల్స్ లో కనిపించి తన సత్తా చాటాడు. నెగటివ్ రోల్స్ చేసే హీరో కి మళ్ళీ హీరో రోల్ లో సినిమా చేసినప్పుడు మార్కెట్ తగ్గిపోతుందని అందరూ అనుకునే వారు. కానీ విజయ్ సేతుపతి అందుకు అతీతం. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మహారాజా’ అందుకు ఉదాహరణ.

    ఈ చిత్రం విజయ్ సేతుపతి 50 వ చిత్రం గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళం భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం తమిళ వెర్షన్ లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఈ ఏడాది జులై 12 వ తారీఖున విడుదల అయ్యింది. అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమా టాప్ 10 లో కొనసాగుతూనే ఉంది. కేవలం మన దేశం కి చెందిన ఆడియన్స్ మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు చెందిన ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని విపరీతంగా వీక్షించడం వల్లే ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న నివేదిక ప్రకారం, ఈ చిత్రానికి ఇప్పటి వరకు 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. గతం లో #RRR చిత్రానికి మాత్రమే ఈ స్థాయి వ్యూస్ వచ్చాయి. ఆ చిత్రం కూడా వంద రోజులకు పైగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యింది.

    నెట్ ఫ్లిక్స్ లో విపరీతంగా ట్రెండ్ అవ్వడం వల్లే ఆ చిత్రం హాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడి ఆస్కార్ అవార్డ్స్ ని కూడా గెల్చుకుంది. ఇప్పుడు ‘మహారాజా’ చిత్రం #RRR కంటే ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ ఇండియన్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా #RRR రన్ ని మ్యాచ్ చేయలేకపోయాయి, కానీ ‘మహారాజా’ చిత్రం మాత్రం #RRR నే దాటేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ నే ఉంది. హిందీ లో అమీర్ ఖాన్ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయట.