Ratan Tata : దేశం గర్వించదగ్గ ఇండస్ట్రియలిస్ట్, గొప్ప మానవతావాడి రతన్ టాటా నేడు చనిపోవడం యావత్తు భారతీయ ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది. 1937 , డిసెంబర్ 28వ తారీఖున జన్మించిన ఆయన 86 ఏళ్ళు జీవించాడు. 1970 వ సంవత్సరం లో టాటా గ్రూప్స్ సంస్థలో మ్యానేజర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన 1991 వ సంవత్సరం లో చైర్ పర్సన్ స్థాయికి ఎదిగాడు. 1991 వ సంవత్సరం నుండి 2012 వ సంవత్సరం వరకు చైర్ పర్సన్ గా ఎన్నో ఎనలేని సేవలను అందించిన రతన్ టాటా, ఆ తర్వాత రిటైర్ అయ్యాడు. కేవలం ఇండస్ట్రియలిస్ట్ గా మాత్రమే కాదు, సమాజ సేవ లో కూడా రతన్ టాటా కోట్లాది మందికి ఆదర్శప్రాయులు. అలాంటి మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. ఆయన ఆలోచనలు, దిశానిర్దేశాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. భావితరాలకు ఉపయోగపడేలా ఉంటాయి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతుంటారు. ఇది ఇలా ఉండగా రతన్ టాటా జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఒక బయోపిక్ గా సినిమా చేయడానికి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు.
రాజ్ కుమార్ హిరానీ స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసి చాలా కాలం అయ్యింది. రణబీర్ కపూర్ రతన్ టాటా క్యారక్టర్ ని చేస్తాడని అందరూ అనుకున్నారు. ఆయన బ్రతికి ఉండగానే ఈ సినిమాని చేసి, ఆయనకు చూపించాలని రాజ్ కుమార్ హిరానీ అభిలాష. కానీ అకస్మాత్తుగా ఆయన ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అత్యంత శోచనీయం. రతన్ టాటా జీవితం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనే చెప్పాలి. ఆయన జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదురుకున్నాడు. ఆయన ఎదిగిన తీరు ఒక మహా అద్భుతం. ప్రేమలో విఫలమైన ఆయన, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక పెళ్లి కూడా చేసుకోలేదు. అలా జీవితాంతం సోలో గానే బ్రతికిన ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి. కచ్చితంగా ఆయన జీవిత చరిత్ర ని వెండితెర పై నేటి తరం యువత కి చూపించాల్సిన అవసరం ఉంది.
పైగా ఈమధ్య కాలం లో బయోపిక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. ఒక బయోపిక్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉండాలి, భావోద్వేగ పూరితమైన సందర్భాలు ఉండాలి, అప్పుడే అవి బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ అవుతాయి. అందుకు ఉదాహరణలు ‘మహానటి’, ‘ఏం ఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ వంటి చిత్రాలు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టించి కాసుల కనకవర్షం కురిపించాయి. రతన్ టాటా బయోపిక్ కూడా అలాంటి స్టోరీ నే. రతన్ టాటా క్యారక్టర్ కి రణబీర్ కపూర్ మాత్రమే సూట్ అవుతాడు. ఈ వెండితెర దృశ్య కావ్యం వచ్చే ఏడాది షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.