Vijay Sethupathi: సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే నియమాన్ని ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. విజయ్ సేతుపతికి సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. పైగా తమిళంలో హీరోగా మంచి మార్కెట్ ఉంది. చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన విజయ్ సేతుపతి ప్రస్తుతం స్టార్ హీరో అయిపోయాడు. విజయ్ సేతుపతి ఓ సినిమా ఒప్పుకున్నాడంటే, ఆ సినిమాకి ఓ ప్రత్యేక బజ్ క్రియేట్ అవుతుంది.
ఆ స్థాయిలో విజయ్ సేతుపతికి డిమాండ్ ఉంది. ప్రమోషన్లలో పాల్గొనడు అని విజయ్ సేతుపతి పై బ్యాడ్ నేమ్ ఉన్నా.. అతని కోసం నిర్మాతలు ఇంకా ఎగబడుతూనే ఉన్నారు. కారణం సౌత్ ఇండియాలోనే పెద్ద స్టార్ గా పేరు ఉండటమే. పైగా ఉప్పెనతో టాలీవుడ్ లో కూడా విజయ్‌సేతుపతికి క్రేజ్ పెరిగింది. సైరాలో కూడా ఓ కీలక పాత్రలో నటించాడు.
Also Read: ఓవర్ బడ్జెట్ తో అల్లు అరవింద్ కే షాక్ ఇచ్చాడు !
అందుకే, తెలుగులో విజయ్ సేతుపతి కోసం ప్రత్యేక పాత్రలు రెడీ అవుతున్నాయి. విజయ్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి మన తెలుగు నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. ఇదంతా గమనించిన విజయ్ సేతుపతి మొత్తానికి తన ఆటిట్యూడ్ చూపించడం మొదలుపెట్టాడు. తనకు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు ‘వద్దు మహా ప్రభో’ అని చెబుతున్నా సినిమాలు వస్తుండేసరికి ఇక విజయ్ లో పైత్యం ఎక్కువ అయింది.
విజయ్ సేతుపతి డేట్లు కావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే. అన్నిటికి మించి బోలెడు కండీషన్లు ఉంటాయి. గతంలో విజయ్ సేతుపతి సినిమాకి ఇంత అని పారితోషికం తీసుకునేవాడు. కానీ, మన తెలుగు నిర్మాతల ఉత్సాహం చూసి.. విజయ్ సేతుపతిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు రోజుల లెక్కన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఇంతకీ రోజుకి ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలుసా ? ఏకంగా కోటి రూపాయలు. ఈ మాట వినగానే మన తెలుగు నిర్మాతలు జేబులో చేయి పెట్టుకుని నడుచుకుంటూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. రోజుకు కోటి ఇచ్చినా విజయ్ సేతుపతి సినిమా ప్రమోషన్లకు రాడు. ఎట్టిపరిస్థితుల్లో రాను అని ఖరాఖండీగా ముందే చెప్పేస్తాడు. ఇక కోటి ఎందుకు ఇవ్వడం దండగ !