https://oktelugu.com/

Campaigning: మోదీ ఖాతాల్లో జమ చేస్తే.. జగన్ ప్రచారం చేసుకుంటున్నారా?

Campaigning: బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం-కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక్కో రైతుకు 2వేల నగదును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో కిసాన్ పథకం కింద మూడో విడుత నగదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2022 సంవత్సరం తొలిరోజే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2022 12:55 pm
    Follow us on

    Campaigning: బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం-కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద ఒక్కో రైతుకు 2వేల నగదును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో కిసాన్ పథకం కింద మూడో విడుత నగదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    2022 సంవత్సరం తొలిరోజే 10వేల కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2వేల చొప్పున 20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి రైతులతో మాట్లాడారు. ఈ కిసాన్ పథకం కింద ఏపీ రైతులకు సైతం డబ్బులు అందాయి. అయితే ఈ పథకం కింద ఏపీ సర్కారు ఎలాంటి నగదును ఇవ్వకపోయినా ప్రచారం మాత్రం చేసుకుంటోంది.

    ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు విడుదల చేసిన డబ్బులనే తిరిగి ఏపీ సర్కారు వారి ఖాతాల్లో జమ చేయనుంది. సోమవారం ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఓ బటన్ నొక్కడం ద్వారా రైతుల ఖాతాల్లోకి 48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమ కానున్నాయి. అలాగే 1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు అందనున్నాయి.

    ఈ పథకం ప్రారంభ సమయంలో ఎప్పుడు ఫుల్ పేజీ యాడ్ తో పబ్లిసీటీ చేసే సర్కారు ఈసారి హాఫ్ పేజీ యాడ్ తో సరిపెట్టింది. ముందుగానే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ప్రభుత్వం గతంలో మాదిరిగానే ప్రచార ఆర్భాటం చేయడం లేదు. కాగా రైతు భరోసా కింద ఏపీ సర్కారు రైతులకు రూ.13,500 ఇస్తామని చెబుతోంది. అయితే ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న 6వేలను రాష్ట్ర ప్రభుత్వం కలిపేసింది.

    కేంద్రం మూడు విడుతల్లో డబ్బులను రైతులకు విడుదల చేస్తుండటంతో రాష్ట్రం సైతం మూడు విడుతల్లో ఇస్తోంది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2వేలతోపాటు ఐదున్నర వేలు, రెండో విడతలో కేంద్రం ఇచ్చే 2వేలతోపాటు మరో రెండు వేలు, మూడో విడతలో కేంద్రం ఇచ్చే 2వేలను ఏపీ సర్కారు అందిస్తోంది.

    ఏపీ సర్కారు రైతులకు ఇప్పుడు మూడో విడుత డబ్బులను ఇవ్వనుంది. దీంతో ఈసారి ఏపీ సర్కారు కేంద్రం విడుదల చేసిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించే అవసరం లేకుండా పోయింది. అయితే కేంద్రం కౌలు రైతులకు ఎలాంటి సాయం అందించడం లేదని తెలుస్తోంది.

    జగన్ సర్కారు మాత్రం కౌలు రైతులను గుర్తించి సాయం చేస్తోంది. మొత్తంగా ఏపీలో ఒకటిన్నర లక్షల మంది రైతులున్నాయి. దీంతో వీరికి 2వేల చొప్పున ఏపీ సర్కారు 30కోట్లను ఈరోజు జమ చేయనుంది. అంటే ప్రభుత్వం ఖర్చు 30కోట్లు ఖర్చు చేస్తూ విరివిరిగా పబ్లిసిటీ చేసుకుంటుందనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది.