Allu Arvind: మలయాళ చిత్రసీమలో కొన్ని చిత్రాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. అందుకే, భారతీయ సినీ చరిత్రలో గొప్ప కళాకారులకు మలయాళ గడ్డ పుట్టినిల్లు అంటుంటారు. ప్రతి ఏడాది బెస్ట్ ఇండియన్ సినిమాల లిస్ట్ తీసుకుంటే అందులో సగం మలయాళ సినిమాలే ఉంటాయి. అలాంటి కోవకి చెందిన సినిమానే ‘నాయట్టు’ అనే మలయాళ సినిమా.
ఈ సినిమాకి వచ్చిన ఆదరణ అద్భుతం. అందుకే, నాయట్టుని తెలుగులో రీమేక్ చేయాలని గీతా ఆర్ట్స్ బాగా ఆశ పడింది. భారీ మొత్తానికి రీమేక్ రైట్స్ ను కూడా కొనుక్కుంది. రీమేక్ రైట్స్ తీసుకున్నాక, సినిమా రీమేక్ బాధ్యతలను పలాస దర్శకుడు కరుణ కుమార్ కి అప్పగించారు అల్లు అరవింద్. కరుణ కుమార్ కూడా ఈ సినిమా పై కొన్ని రోజులు బాగా వర్క్ చేశారు.
Also Read: మీకు కాబోయే భర్త ఇలా చేస్తున్నాడా..? అయితే బీ కేర్ ఫుల్..
ఓ దశలో ‘నాయట్టు’ తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్రలుగా రావురమేష్, అంజలిలను ఎంచుకున్నాడు. ఇక స్క్రిప్ట్ లో కూడా తెలుగు నేటివిటీకి తగట్టు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక షూటింగ్ కి అంతా రెడీ అనుకున్నారు. కానీ, సడెన్ గా ఈ సినిమా ఆగిపోయింది అనే వార్త సినిమా ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే.. నిజంగానే ఈ సినిమా ఆగిపోయింది.
ఇంతకీ, చివరి దశలో ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది ? కారణం తెలియలేదు. కానీ, వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి బడ్జెట్ సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. కీలక పాత్రలలో స్టార్లును తీసుకోలేదు. మరి బడ్జెట్ ఎందుకు పెరిగింది ? కరుణ కుమార్ అవగాహన లోపమే కారణం అని తెలుస్తోంది.
ఈ సినిమాని అల్లు అరవింద్ రూ.4 కోట్లలో తీయాలని ప్లాన్ చేశారు. కరుణ కుమార్ కి చిన్న సినిమాలు చేసిన అనువం ఉంది కదా అని అతనికి ఈ సినిమాని అప్పజెప్పారు. అయితే, కరుణ కుమార్ బడ్జెట్ లెక్కల విషయంలో పొరపాట్లు చేసినట్లు తెలుస్తోంది. కరుణ కుమార్ లెక్కల ప్రకారం సినిమాకి రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడట. షాక్ అయిన అరవింద్ వెంటనే సినిమాని ఆపేశారని తెలుస్తోంది. మొత్తానికి కరుణ కుమార్ ఓవర్ బడ్జెట్ తో అల్లు అరవింద్ కే షాక్ ఇచ్చాడుగా.
Also Read: బాలీవుడ్ స్టార్ హీరో కి, ఆయన భార్య కి కరోన పాజిటివ్… ఎవరంటే ?