Chandrababu comments on Vijay: గత నెల రోజులుగా హోరాహోరీగా సాగిన తమిళనాడు ఎన్నికల ప్రచారం నేటి తో మరికాసేపట్లో ముగియబోతుంది. ఈ ఎన్నికల్లో ప్రధమ పోటీ ఎన్డీయే , ఇండియా కూటమి మధ్యనే ఉంటుందని సర్వేలు తేల్చి చెప్పేశాయి . మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి లోనే ఉన్నాడు కాబట్టి నిన్న, ఈరోజు ఆయన తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల ప్రచారం లో పాల్గొనాల్సింది. కానీ ఆయన తీవ్రమైన అస్వస్థతతో ఉండడం , రీసెంట్ గానే ఆయన ముక్కుకి సర్జరీ జరగడం తో , డాక్టర్లు వారం నుండి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారు. దీంతో ఆయన ఈ ఎన్నికల ప్రచారం లో భాగం అవ్వలేకపోయారు.
అయితే ఎన్నికల ప్రచారం లో భాగంగా , సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒక రిపోర్టర్ తమిళ హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ గురించి పలు ప్రశ్నలు అడగడం , అందుకు చంద్రబాబు నాయుడు తెలివి గా ఇచ్చిన సమాదానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘చంద్రబాబు గారు , మీరు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ నుండి ఉన్నారు , ఈ రాజకీయాల్లో ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ వంటి వారు సక్సెస్ అవ్వడం చూశారు , ఈసారి ఇక్కడ హీరో విజయ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది ?, కోయంబత్తూరు తో పాటు, పలు మేజర్ సిటీస్ లో మీరు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు , మీ అంచనా ప్రకారం విజయ్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ‘ అని అడుగుతారు.
దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తూ ‘ఎన్టీఆర్ , ఎంజీఆర్ చాలా డిఫరెంట్. వాళ్ళిద్దరిని పోల్చడం సరికాదు. అయితే ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితుల పై నేను కామెంట్ చేయడం లేదు , ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ రాజకీయాలు చాలా డిఫరెంట్ , సర్వీస్ చాలా డిఫరెంట్. జనాలు వాటిని చూసే నాయకులను ఎంచుకుంటారు. చూడాలి మరి ఏమి జరగబోతుందో’ అంటూ చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. నిన్న కూడా ఆయన విజయ్ గురించి ప్రశ్న అడిగినప్పుడు , మీరే చూస్తారు గా , జనాలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారా అంటూ చెప్పుకొచ్చాడు.