Panjaa Movie Heroine: కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ అవ్వకపోయిన, వాళ్ళు చేసిన ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘పంజా'(Panja Movie) చిత్రాన్ని అప్పట్లో మీరంతా చూసే ఉంటారు. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కానీ కాలక్రమేణా ఈ సినిమా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఈ చిత్రాన్ని అత్యధికంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ సినిమా లో హీరోయిన్స్ గా సారా జేన్ దివాస్(Sara Jen Divas), అంజలి లవానియా(Anjali Lavaniya) నటించారు. ఈ ఇద్దరి హీరోయిన్స్ కి కూడా అప్పట్లో మంచి పేరు వచ్చింది. సారా జేన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా, అంజలి లావానియా సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంజలి లవానియా కి అదే మొదటి సినిమా, అదే చివరి సినిమా కూడా. ప్రస్తుతం ఆమె క్లబ్స్ లో పని చేస్తుంది.
ఇక సారా జేన్ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఈమె ఏమి చేస్తుంది?, సినిమాల్లోనే ఉందా? లేక మానేసిందా అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. పంజా చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు. తమిళం, హిందీ, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోనూ తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ ఒకే ఒక్క సినిమా ఈమెకు గుర్తింపుని తీసుకొచ్చింది. హిందీ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సారా జేన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది, సారా జేన్ కి మంచి రీచ్ కూడా వచ్చింది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. వైస్రాయ్ హౌస్, ది బకింగ్ హమ్ మర్డర్స్ వంటి ఇంగ్లీష్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
అదే విధంగా రీసెంట్ గా ఈమె హిందీ లో సూపర్ హిట్స్ గా నిల్చిన తాండవ్, మేడ్ ఇన్ హెవెన్, ది ఫ్రీలాన్సర్ వంటి వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె కంఖజురా అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతుంది. ఇలా వెండితెర పై అనుకున్నంత రేంజ్ కి వెళ్లలేకపోయినప్పటికీ, ఓటీటీ రంగం లో గొప్పగా రాణించడమే కాకుండా, హాలీవుడ్ మూవీస్ లో కూడా చేస్తూ బిజీ గా తన జీవితాన్ని కొనసాగిస్తుంది సారా జేన్. మళ్ళీ ఈమె తెలుగు లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా? ఒకవేళ ఇస్తే ఎలాంటి పాత్రలు చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుత పరిస్థితులలో ఆమెకి హీరోయిన్ రోల్స్ రావడం కష్టమే అనొచ్చు.