Thalapathy Vijay : అక్షరాలా 6 వేల థియేటర్లు..విడుదలకు ముందే నిర్మాతకు కళ్ళు చెదిరే లాభాలు..విజయ్ క్రేజ్ మామూలుగా లేదుగా!

గోట్ సినిమా నిర్మాత అర్చన మాట్లాడుతూ గోట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6000 వేలకు పైగా థియేటర్స్ లో విడుదల అవుతుందని, తమిళ నాడు లో ఉన్న అన్నీ థియేటర్స్ లోనూ గోట్ చిత్రం ప్రదర్శితమవుతుందని, మొదటి రోజు తమిళ సినిమాల్లో ఆల్ టైం రికార్డు పెట్టే చిత్రం గోట్ నిలుస్తుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకుంది

Written By: Vicky, Updated On : August 21, 2024 8:03 pm

Vijay Goat Movie

Follow us on

Thalapathy Vijay : ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే మన అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి, ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో రజినీకాంత్ కి పోటీగా ఇలయతలపతి విజయ్ మారిపోయాడు. ఒకప్పుడు విజయ్ నాన్ రజినీకాంత్ రికార్డ్స్ కొట్టేవాడు, కానీ ఇప్పుడు రజినీకాంత్ తో సమానంగా ఓపెనింగ్ మరియు క్లోసింగ్ రికార్డ్స్ పెడుతున్నాడు. ఇప్పుడు తమిళనాడు లో ఆయన ఏ సినిమా తీసిన ఆడియన్స్ చూసే విధంగా తయారైంది. ఆయన ఫ్లాప్ టాక్ చిత్రాలు కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఉదాహరణకి ఆయన గత చిత్రం ‘లియో’ మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అయినప్పటికీ కూడా ఆ చిత్రం ‘జైలర్’ తో సరిసమానంగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒకవేళ ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉండుంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అలవోకగా కొట్టి ఉండేది అని చెప్పొచ్చు. ఇకపోతే విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా వచ్చే నెల 5 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నిర్మాత అర్చన మాట్లాడుతూ గోట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6000 వేలకు పైగా థియేటర్స్ లో విడుదల అవుతుందని, తమిళ నాడు లో ఉన్న అన్నీ థియేటర్స్ లోనూ గోట్ చిత్రం ప్రదర్శితమవుతుందని, మొదటి రోజు తమిళ సినిమాల్లో ఆల్ టైం రికార్డు పెట్టే చిత్రం గోట్ నిలుస్తుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకుంది. సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ కి క్రేజ్ కారణంగా ఈ సినిమాకి డబుల్ టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అంతే కాదు ఈ చిత్రాన్ని సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో తెరకెక్కించారట. తొలుట ఈ చిత్రం షూటింగ్ ని ఇస్తాంబుల్ లో తెరకెక్కించాలని అనుకున్నారట, కానీ అక్కడ అనుమతి రాకపోవడం తో రష్యా లో ప్రధాన భాగం షూటింగ్ ని తెరకెక్కించారట. ఇక వీఎఫ్ఎక్స్ పనులు మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన లోలా సంస్థతో చేయించుకున్నారట. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే విజయ్ అభిమానులు ప్రీమియర్ షోస్ ఈసారి లేకపోవడంతో కాస్త నిరాశకి గురయ్యారు. ఓవర్సీస్ లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ వారం లోనే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. విజయ్ కి ఇదే చివరి చిత్రం, ఈ సినిమా తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చెయ్యబోతున్నాడు, ఇప్పటికే ఆయన పార్టీ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.