Robot : ఆ విషయంలో పురుషుల కంటే రోబోలే ఎక్కువగా సంతోషాన్ని ఇస్తున్నాయట..!

డాక్టర్ ఇయాన్ పియర్సన్ అనే వైద్యుడు చెప్పిన ప్రకారం రాబోయే రోజుల్లో కొందరు మహిళలు పురుషులతో కంటే రోబోలతోనే ఎక్కువగా ఆనందాలు పొందుతారని పేర్కొన్నారు.. అసలు విషయం ఏంటంటే? 

Written By: Chai Muchhata, Updated On : August 21, 2024 7:47 pm

Romance With Robot

Follow us on

Robot : కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో మనుషులు చేయాల్సిన కొన్ని పనులు యంత్రాలు చేస్తున్నాయి. ఏ రంగంలోనైనా యాంత్రీకరణ సమంజసమే. కానీ అతిగా వినియోగించడం వల్ల మానవ సంపద తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడున్న కొద్ది మంది మనుషులు మాట్లాడాలన్నా.. తమ భావాలను వ్యక్త పరచాలన్నా వారికి ఇతరులకు కనిపించరు. దీంతో యంత్రాలతోనే తమ భావాలను వ్యక్త పరుచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనలోని భావాలను మనుషులతో కాకుండా రోబోలతో పంచుకోవాల్సి వస్తుందని ఓ వైద్యుడు ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. డాక్టర్ ఇయాన్ పియర్సన్ అనే వైద్యుడు చెప్పిన ప్రకారం రాబోయే రోజుల్లో కొందరు మహిళలు పురుషులతో కంటే రోబోలతోనే ఎక్కువగా ఆనందాలు పొందుతారని పేర్కొన్నారు.. అసలు విషయం ఏంటంటే?
డాక్టర్ ఐయాన్ చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం రోబోలే అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని రంగాల్లో రోబోలను ప్రవేశపెట్టారు. ఇవి మనుషుల కంటే ఎక్కువగా పనిచేస్తాయని కొందరి అభిప్రాయం. అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా రోబోలకు మనసు ఉండదని ఇప్పటి వరకు చెప్పుుకుంటూ వచ్చారు. కానీ రాబోయే రోజుల్లో రోబోలు కూడా ప్రేమగా ఉంటాయని అంటున్నారు. ఇవికూడా మనుషుల్లాగే ఆలోచిస్తూ కావాలసినంత ప్రేమను అందిస్తాయట. అయితే ఈవిషయాన్ని డాక్టర్ ఐయాన్ ఊరికే చెప్పలేదు. దీనికో ఆధారం చూపించాడు.
డేవిడ్ మిల్స్ అనే వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆయన టాఫీ అనే రోబోతో జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మ కారణంగా నేను చాలా మందిని కలిశాను. కానీ బొమ్మ లేకుండా నేను ఎవరితో శృంగారంలో పాల్గొనలేదు అని వివరించాడు. అయితే శృంగారం విషయంలోనూ రోబోలదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉందని డేవిడ్ మిల్స్ చెప్పిన ప్రకారం తెలుస్తోంది. ఈ కారణంగా కొంత మంది మహిళలు పురుషులను కాదని రోబోలతో స్నేహం చేస్తాయని వాటితో ఆప్యాయంగా ఉండే అవకాశం ఉందని ఐయాన్ వివరించాడు.
అయితే ఈ పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టదని, 2050లోనే బొమ్మలతో శృంగారం చేసే రోజులు వస్తాయని అన్నారు. ఇదే కనుగ మొదలైతే మనుషుల మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేకుండా పోతాయి. ఏ పని చేయాలన్నా రోబోలనే ఆశ్రయిస్తారు. మనిషి తయారు చేసిన రోబో అప్పుడు మనిషినే ఏలే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని ఎవరైనా కంట్రోల్ చేయగలరా అంటే ఆ విషయాన్ని అప్పుడే చెప్పలేం అని అంటున్నారు. కానీ కొన్నిఅవరాలకు మాత్రం రోబోలను వినియోగించుకోవచ్చని, ప్రతీ దానికి రోబోలపై ఆధారపడితే పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. మనుషలు సొంతంగా ఆలోచించడం మరిచి ఏఐపై ఆధారపడుతున్నారు. దీంతో సొంత తెలివి పక్కకుపోయి యంత్రాలను చేయమని చెబుతున్నారు. ఈ పరిస్థితి మరింతగా ముందుకు వెళ్లి ఏఐతోనే గడిపే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పెరిగిపోతుంది. సమాజంలో లేనిదానిని సృష్టించే ఏఐతో ఎప్పటికైనా ప్రమాదమే అని కొందరు హెచ్చరిస్తున్నారు.