https://oktelugu.com/

Naga Chaitanya-Shobhita wedding : నాగ చైతన్య-శోభిత పెళ్లి జరిగేది ఎక్కడో తెలుసా? ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు!

నాగ చైతన్య ఇంట్లో పెళ్లి సందడి మొదలైందంటూ కథనాలు వెలువడుతున్నాయి. పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారట. అలాగే వేదిక ఎక్కడనే విషయం మీద తర్జన భర్జన పడుతున్నారట. నాగ చైతన్య-శోభిత పెళ్లి ఎక్కడ జరగనుంది? ముహూర్తం ఎప్పుడనే విషయాలు తెలుసుకుందాం...

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 / 08:16 PM IST

    Naga Chaitanya:

    Follow us on

    Naga Chaitanya-Shobhita wedding : అక్కినేని నాగ చైతన్య త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాళ్ల ఆయన జీవిత భాగస్వామిగా రానుంది. ఇటీవల నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి పనులు కూడా మొదలయ్యాయట. వివాహ వేదిక, పెళ్లి తేదీ వంటి విషయాలపై చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    నాగ చైతన్య – సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్న సమంత – నాగ చైతన్య మనస్పర్థలతో విడిపోయారు. 2021లో డివోర్స్ తీసుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఎవరి దారులు వారు ఎంచుకున్నారు. కాగా విడాకుల తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడు.

    శోభిత – నాగ చైతన్య చాలా కాలం సీక్రెట్ గా డేటింగ్ చేశారు. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. పలుమార్లు నాగ చైతన్య – శోభిత కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగ చైతన్య స్పందించలేదు. శోభిత మాత్రం తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దు అంటూ ఈ వార్తలను ఖండించింది. నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ జరుపుకుని సడన్ షాక్ ఇచ్చింది.

    ఆగస్టు 8వ తేదీన నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కినేని వారి కుటుంబంలోకి కొత్త కోడల్ని సంతోషంగా ఆహ్వానించారు. మంచి ముహూర్తం దొరకడంతో నిశ్చితార్థం హడావుడిగా జరిపించేశాము. పెళ్లికి ఇంకా సమయం ఉందని నాగార్జున తెలిపారు. కాగా పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తుంది.

    నాగ చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడట. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో గల ఫేమస్ లొకేషన్స్ ని పరిశీలిస్తున్నాడట. లేదంటే ఫారెన్ లో వెడ్డింగ్ చేసుకునే ఆలోచన చేస్తున్నాడట. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ముహూర్తం ఫిక్స్ చేయనున్నారట. మరో ఆరు నెలల్లో అక్కినేని నాగ చైతన్య పెళ్లి పీటలు ఎక్కడం గ్యారంటీ అంటున్నారు.

    ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో నాగ చైతన్య బిజీగా ఉన్నాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. సాయి పల్లవి మరోసారి నాగ చైతన్యతో జతకడుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండేల్ ఎమోషనల్ లవ్ డ్రామా. నాగ చైతన్య జాలరి పాత్ర చేస్తున్నాడు. శోభిత సైతం సితార టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది.