Vijay : సినిమాల్లో సూపర్ స్టార్ గా, తమిళనాట నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్(Thalapathy Vijay) ‘తమిళగ వెట్రి కళగం'(Tamilaga Vetri Kalagam) అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘జన నాయగన్'(Jana Nayagan) అనే సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నాడు. వచ్చే ఏడాది తమిళనాడు లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నాడు. అయితే ఈ పార్టీ ని స్థాపించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తమిళనాడు ప్రాంతంలోని మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను నిర్వహించాడు. ఈ వేడుక లో ఆయన భవిష్యత్తులో పార్టీ అనుసరించబోయే విధి విధానాలు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వెలికి తీసి చూపిస్తూ మాట్లాడిన మాటలు సెన్సేషనల్ గా మారాయి.
Also Read : విజయ్ ఇంటిపైకి చెప్పు విసిరిన యువకుడు.. భగ్గుమన్న తమిళనాడు.. అసలేమైందంటే?
ఇదే కార్యక్రమం లో ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా విజయ్ కి రాజకీయ సలహాదారుడిగా TVK పార్టీ కి వ్యవహరించబోతున్నాడు. ఇందుకోసం ఆయన విజయ్ నుండి భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకోనున్నాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ మాజీ సీఎం జగన్ కి ఎన్నికల వ్యవహకర్త గా వ్యవహరించాడు. ఫలితంగా 2019 వ సంవత్సరం లో వైసీపీ పార్టీ ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా తమిళనాడు లో DMK పార్టీ కి కూడా ఆయన వ్యవహకర్తగా వ్యవహరించాడు. ఫలితంగా ఆ పార్టీ కూడా సంచలన విజయం సాధించింది. స్టాలిన్ ప్రస్తుతం సీఎం గా కొనసాగుతున్నాడు. ఇలా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రతీ పార్టీ అధికారం చేపట్టింది. కాబట్టి విజయ్ పార్టీ ని కూడా అధికారం లోకి తీసుకొచ్చే బాధ్యత నాదని ఆయన ఈ వేడుకలో చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో బుధవారం రోజున ఒక యువకుడు విజయ్ ఇంటిపై చెప్పులు విసిరిన ఘటన సంచలనం రేపింది. చెప్పులు విసిరిన వెంటనే పారిపోయే ప్రయత్నం చేయగా, విజయ్ వ్యక్తిగత సిబ్బంది అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ యువకుడు ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ ‘ నేను కేరళ రాష్ట్రంలోని మణప్పురం అనే ప్రాంతం నుండి ఇక్కడి వచ్చాను. నేను విజయ్ సార్ కి వీరాభిమానిని. తమిళనాడు నుండి చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. విజయ్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చేందుకే చెప్పులు విసిరాను’ అంటూ చెప్పుకొచ్చాడు. వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదూ, పోలీసులు చెప్పినట్టు గానే ఇతనికి నిజంగానే మతి స్థిమితం లేనట్టుగా అనిపిస్తుంది. పోలీసులు ఈ విషయం పై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క విజయ్ ఈ ఘటన పై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
Also Read : తమిళనాడులో మూడు కూటములా, నాలుగు కూటములా?