Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన పెళ్లి, భార్య వంటి వ్యక్తిగత విషయాల మీద స్పందించాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ఎవరో ఒత్తిడి చేస్తున్నారని నేను వివాహం చేసుకోను. నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను. నా పెళ్లి చాలా సింపుల్ గా జరుగుతుంది. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునే అమ్మాయి కావాలి. అలాగే అభిరుచులు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా ఆ అమ్మాయి నాకు గుర్తు చేయాలి. అలాంటి అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని విజయ్ దేవరకొండ అన్నారు.
కాగా విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందానతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు రష్మిక మందాన పాల్గొంటుంది. ఇద్దరూ రెండు సార్లు ఏకాంతంగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ విషయాన్ని రష్మిక మందాన ఒప్పుకోవడం విశేషం. అయితే ఫ్రెండ్ తో వెకేషన్ కి వెళితే తప్పేంటని ఆమె అన్నారు.
త్వరలో విజయ్ దేవరకొండ-రష్మిక మందాన పెళ్లి ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. ఈ పుకారైతే పరిశ్రమలో ఉంది. వీరిద్దరూ కలిసి రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విచ్చలవిడి రొమాన్స్ చేశారు. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ-రష్మిక మందాన కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం భారీ విజయం సాధించింది.
ఇక ఖుషి విషయానికి వస్తే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ సూపర్ హిట్ అయ్యింది…