Family Star Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ స్టార్… దుష్ప్రచారమే దెబ్బతీసిందా!

ఫ్యామిలీ స్టార్ పై నెగిటివ్ కామెంట్స్ ఓపెనింగ్స్ ని కూడా దెబ్బ తీశాయి. ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసింది. దాంతో అనుకున్న సమయానికి ముందే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది.

Written By: S Reddy, Updated On : May 1, 2024 1:48 pm

Family Star movie getting a super response on OTT

Follow us on

Family Star Movie: విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడు. గీత గోవిందం కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ సైతం మెప్పించింది. యూత్ లో బజ్ క్రియేట్ చేసింది. అయితే ఫలితం మాత్రం వేరుగా వచ్చింది. ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ట్విట్టర్ వేదికగా నెగిటివ్ రివ్యూలు హల్చల్ చేశాయి.

ఫ్యామిలీ స్టార్ పై నెగిటివ్ కామెంట్స్ ఓపెనింగ్స్ ని కూడా దెబ్బ తీశాయి. ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసింది. దాంతో అనుకున్న సమయానికి ముందే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుండి ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాగా ఫ్యామిలీ స్టార్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ప్రైమ్ టాప్ 10లో మొదటి స్థానం ఫ్యామిలీ స్టార్ ఆక్రమించింది.

ఫ్యామిలీ స్టార్ కి ఓటీటీలో విశేష ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ బాగానే ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం అయినంత చెత్త సినిమా అయితే కాదు. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకు అంతగా ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని టార్గెట్ చేశారో అర్థం కావడం లేదంటున్నారు. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే… డీసెంట్ మూవీ అనిపిస్తుంది.

దిల్ రాజు, విజయ్ దేవరకొండ పై ఒక వర్గం కత్తి కట్టిందనే వాదన వినిపిస్తోంది. దానిలో భాగంగానే ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని తొక్కేశారని అంటున్నారు. కాగా దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా చేయాల్సింది. పరశురామ్ సడన్ గా దిల్ రాజు బ్యానర్ లో తన నెక్స్ట్ మూవీ ప్రకటించారు. పరశురామ్ పై మండిపడ్డ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. చివరి నిమిషంలో పరశురామ్ బ్రతిమిలాడుకోవడంతో ఆగాడు.