విజయ్ దేవరకొండ ఇంట్లో ఏం చేస్తున్నాడో చూడండి

కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. సినిమా థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు ఆగిపోయి ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోయింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్ లో సందడి లేక సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పిడే కరోనా థర్డ్ వేవ్ సూచనలు లేకపోవడంతో సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ‘బాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ ఎంటర్ అయ్యాడు. తన లేటెస్ట్ లుక్ ను రివీల్ చేశాడు. ‘లైగర్’ సినిమా […]

Written By: NARESH, Updated On : August 12, 2021 11:53 am
Follow us on

కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. సినిమా థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు ఆగిపోయి ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోయింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్ లో సందడి లేక సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పిడే కరోనా థర్డ్ వేవ్ సూచనలు లేకపోవడంతో సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ‘బాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ ఎంటర్ అయ్యాడు. తన లేటెస్ట్ లుక్ ను రివీల్ చేశాడు. ‘లైగర్’ సినిమా అప్ డేట్ ఇచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ మూవీ తెరకెక్కుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న దీన్ని కరణ్ జోహర్, పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజాగా ‘లైగర్’ మూవీ కోసం విజయ్ దేవరకొండ వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్టుగా తెలిపాడు. ‘యువర్ బాయ్ ఈజ్ బ్యాక్.. వర్క్ ఫ్రం హోం’ అంటూ తన సోషల్ మీడియాతో ఖాతాల్లో ఒక వర్కింగ్ స్టిల్ ఫొటోను షేర్ చేశాడు. లైగర్ మూవీ కోసం విజయ్ దేవరకొండ డబ్బింగ్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

విజయ్ ఒక చేతిలో మైక్ పట్టుకొని ఉండగా.. మరో చేతిలో ఓ కాఫీ కప్, మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని యమ స్టైలిష్ గా కనిపించాడు. ఈ అల్ట్రా మోడల్ లుక్ చూసి విజయ్ దేవరకొండ అభిమానులు ఖుషీ అవుతున్నారు. లైగర్ టీజర్ కోసం ఉత్కంఠగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.