
అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్ లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్ హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సకారాలు అందించింది. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.