Vijay Deverakonda Rashmika: రష్మిక మందాన-విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందనే వాదన ఉంది. ఈ క్రమంలో మరోసారి వీరు రొమాంటిక్ టూర్ కి వెళ్లి దొరికిపోయారు. రష్మిక మందాన విజయ్ దేవరకొండకు చాలా క్లోజ్. ఆమె హైదరాబాద్ వస్తే విజయ్ దేవరకొండను కలవాల్సిందే. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ వేడుకలకు ఆమె తప్పకుండా హాజరవుతారు. పండగలు కూడా కలిసి జరుపుకుంటారు. విజయ్ దేవరకొండ పేరెంట్స్ తో కూడా రష్మిక మందానకు అనుబంధం ఉంది.
రష్మిక మందాన-విజయ్ దేవరకొండ కలిసి రెండు చిత్రాలు చేశారు. గీత గోవిందం మూవీ కోసం ఫస్ట్ టైం కలిశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. రష్మిక మందానకు భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు. ఈ మూవీ అంతగా ఆడలేదు. అయితే విజయ్ దేవరకొండలో రష్మిక కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు.
కాగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ పలుమార్లు దొరికిపోయారు. దాంతో ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. మీడియా ఈ మేరకు అడగడం జరిగింది. రష్మిక స్పందిస్తూ వాటిని కొట్టిపారేశారు. ఇక రెండు సార్లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ కి వెళ్లిన విషయాన్ని రష్మిక ఒప్పుకుంది కూడాను. మిత్రుడితో టూర్ కి వెళితే తప్పేంటని కౌంటర్ ఇచ్చింది.
ఎంత మిత్రుడు అయితే మాత్రం ఒకే గదిలో హోటల్ లో ఎలా ఉంటారనే సందేహాలు ఉన్నాయి. బయటపడకున్నా విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నారనే మాట గట్టిగా వినిపిస్తుంది. తాజాగా మరోసారి దొరికిపోయారు. ఇద్దరూ కలిసి వియత్నాం వెళ్లారు. ఈ విషయం వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్స్ తో క్లారిటీ వచ్చింది. వరుసగా ఏకాంత విహారాలకు వెళుతున్న వీరు లవర్స్ కాక, ఇంకేంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ-రష్మికలకు ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు రావడం గమనార్హం.