Guntur Kaaram Collections: గుంటూరు కారం సినిమాకి అన్ని కలెక్షన్స్ వచ్చాయా..? ఇది నిజమా లేక ఫేకా..?

సంక్రాంతికి మహేష్ బాబు సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అని మహేష్ బాబు అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నప్పటికి ఈ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

Written By: Gopi, Updated On : January 16, 2024 10:31 am

Guntur Kaaram Collections

Follow us on

Guntur Kaaram Collections: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో వచ్చిన గుంటురు కారం సినిమా మొదటి షో తోనే సూపర్ సక్సెస్ అవుతుంది ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అని మహేష్ బాబు అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నప్పటికి ఈ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ముఖ్యంగా ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడం అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సినిమా కంటెంట్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే మొదటి రెండు రోజులు సినిమా కలెక్షన్స్ ని పెద్దగా అనౌన్స్ అయినప్పటికీ మూడో రోజు గడిచిన తర్వాత నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ని భారీగా వసూలు చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో గుంటురు కారం సినిమా మూడు రోజుల్లో 164 కోట్లకు పైన వసూళ్లను రాబట్టింది అంటూ సినిమా యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ పోస్టర్ ని చూసిన చాలా మందికి చాలా రకాల డౌట్లైతే వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తో పాటు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. హనుమాన్ సినిమాకి షోలు పెరిగాయి, థియేటర్లు కూడా పెరిగాయి. దాంతో గుంటూరు కారం సినిమాకి ఆడియెన్స్ తగ్గారు, థియేటర్లు తగ్గాయి అయినప్పటికీ మొదటి రోజు కంటే సెకండ్ డే థర్డ్ డే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సినిమా యూనిట్ తెలియ జేస్తుంది.ఇక దీని బట్టి చూస్తుంటే గుంటురు కారం సినిమా కి సంబంధించిన కలెక్షన్లు ఫేక్ కలెక్షన్స్ అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ రోజు ఎలాంటి టాక్ వస్తుంది తెలీయదు వచకాబట్టి అలాంటి టైం లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నదించింది.

ఇక రెండవ రోజు, మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటూ సినిమా యూనిట్ హడావిడి చేయడం పట్ల కొంత మంది సినీ మేధావులు సైతం గుంటూరు కారం సినిమా మీద డౌట్ పడుతున్నారు. ఇక హనుమాన్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశ్యం తో గుంటూరు కారం టీమ్ షేక్ ప్రచారాలు చేస్తుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…