https://oktelugu.com/

Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ వచ్చేది ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్…

సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రీతిలో భారీ సక్సెస్ సాధించి భారీ వసూళ్లని కూడా రాబట్టింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2024 / 10:20 AM IST

    Pushpa 2 Trailer

    Follow us on

    Pushpa 2 Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సుకుమార్ అనే చెప్పాలి. సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రీతిలో భారీ సక్సెస్ సాధించి భారీ వసూళ్లని కూడా రాబట్టింది. ఇక ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు గా ప్రకటించారు.

    ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ కు సంబంధించిన డేట్ ని మాత్రం ప్రస్తుతం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ఒక గ్లింప్స్ తోనే ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ డేట్ ఓపెన్ గా ప్రేక్షకులకు అనౌన్స్ చేయనప్పటికీ చిత్ర యూనిట్ ద్వారా అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమా ట్రైలర్ ని మార్చ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఈ సినిమాకు రెండు ట్రైలర్ లని రిలీజ్ చేయాలనే ఆలోచనలు చిత్ర యూనిట్ ఉన్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు సలార్ సినిమాకి కూడా అలాగే రెండు ట్రైలర్ లను రిలీజ్ చేశారు. ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమా మొదటి ట్రైలర్ ని జూన్ లో రిలీజ్ చేసి సెకండ్ ట్రైలర్ ని జూలై ఎండింగ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

    ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా సాగుతూ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోనే చాలావరకు ఎక్కువ టైం గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆగస్టు లో ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది…