Vijay Deverakonda Rashmika Viral Photos: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) మరోసారి హాట్ టాపిక్ గా మారారు. వీళ్లిద్దరు ఇది వరకే ఎన్నో సార్లు కలిసి తిరుగుతూ కనిపించారు. ఇద్దరు కలిసి వరల్డ్ టూర్స్ కి కూడా వెళ్లారు, వీళ్ళు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు, కానీ ఆ విషయాన్నీ అధికారికంగా ప్రకటించకుండా ఇలా పరోక్షంగా హింట్స్ ఇస్తూ ఉంటారు. నేడు ముంబై విమానాశ్రయం లో మరోసారి వీళ్లిద్దరు జంటగా కనిపించారు. ఒకేసారి కలిసి వస్తే చాలా తేలికగా గుర్తు పట్టేస్తారని, ఒకరి తర్వాత ఒకరు ఒకే కారులో ప్రయాణించారు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంత కష్టపడడం దేనికి?, రిలేషన్ లో ఉన్నామని బహిరంగంగా చెప్పేయొచ్చు కదా?, ఎందుకిలా దొంగలు లాగా తిరగడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వీళ్ళిద్దరిని ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు.
రష్మిక ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం జరిగిన కొత్తల్లో విజయ్ దేవరకొండ తో కలిసి ‘గీత గోవిందం’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే దిశకు వచ్చినప్పిడు రష్మిక, రక్షిత్ శెట్టి జంట నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుండే విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి. అనేకసార్లు విజయ్ దేవరకొండ ఈ వార్తలపై స్పందించి అలాంటిదేమి లేదని బలంగా సోషల్ మీడియా ద్వారా చెప్పేవాడు. కానీ వీళ్ళు నిజంగా రిలేషన్ లో ఉన్నారు అనేది వాస్తవం అని కాలం గడిచే కొద్దీ అర్థమైంది. ‘గీత గోవిందం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Also Read: Rashmika Mandanna: విజయ్ దేవరకొండ తో భవిష్యత్తులో కలిసి నటించే ప్రసక్తే లేదు : రష్మిక
ఇకపోతే రష్మిక హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస గా వెయ్యి కోట్ల రూపాయిల సినిమాలను కొల్లగొడుతూ ఇండియా లోనే నెంబర్ 1 పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిన ఆమెకు రీసెంట్ గా విడుదలైన ‘సికిందర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు కుబేర చిత్రం తో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది రష్మిక. మరో పక్క వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం తో జులై 25 న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా తో అయినా విజయ్ దేవరకొండ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.
Vijay Deverakonda and Rashmika Mandanna are spotted together in Mumbai airport taking an exit in the same car.
This video is now viral all over..#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/QNBgCAucQa
— Telugu360 (@Telugu360) June 18, 2025