Phone Farming: ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి ఎదురైంది. విద్యార్థుల నుంచి పెద్దపెద్ద వ్యాపారాలు చేసే వారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ తోనే కనెక్ట్ అయి ఉంటున్నారు. అయితే మొబైల్ వాడకం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. మొబైల్లో జాగ్రత్తగా వాడకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొబైల్ కేవలం అవసరాల కోసం మాత్రమే కాకుండా దీని ద్వారా అనే ఉపాధి పొందే వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇదే సమయంలో అతి తొందరగా ధనవంతులు కావాలని ఆశతో కొందరు అక్రమంగా సంపాదించడానికి ఒడిగడుతున్నారు. ఇందులో భాగంగా వినియోగదారులను పావులుగా చేసుకుని వారికి తీవ్ర నష్టాన్ని గురిచేస్తున్నారు. వీటిలో ‘ఫోన్ ఫార్మింగ్’ ఒకటి. Phone Faming అంటే ఏమిటి? దీని ద్వారా వినియోగదారులకు ఎలాంటి నష్టం ఉండనుంది?
ఫామింగ్ అనగానే చాలామంది వ్యవసాయం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఫోన్ ఫామింగ్ విషయానికి వస్తే ఇదో రకమైన మోసపూరిత వ్యాపారం. సాధారణంగా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేసి సంపాదించేవారు చాలామంది ఉన్నారు. అయితే తక్కువ సమయంలో ఈ మాధ్యమాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించాలని కొందరు చీట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫేక్ పోస్టులు పెట్టి వాటి ద్వారా సర్వే చేస్తున్నట్లు చెప్పి.. వినియోగదారుల చేత క్లిక్ చేయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని యాడ్స్ అప్లోడ్ చేసి వీటిని చూడడం ద్వారా డబ్బులు అందిస్తామని చెబుతున్నారు. అయితే కొందరు ఇలా ఫేక్ వెబ్సైట్ల పై క్లిక్ చేసి చాలావరకు నష్టపోయారు. అంతేకాకుండా ఇలాంటి వెబ్సైట్లపై క్లిక్ చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన వారు అవుతారని కూడా చెబుతున్నారు.
Also Read: Phone : ఫోన్ ఇలా తయారైందేంటి? చేసింది మనమే కదా..
ఇటీవల ఫోన్ ఫామింగ్ ఎక్కువ అవుతుంది. యూట్యూబ్లో, ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ ను పెంచుకోవడం కోసం సర్వేల పేరిట కొన్ని వీడియోలను అప్లోడ్ చేసి వాటిపై క్లిక్ చేయాలని కోరుతున్నారు. అలా క్లిక్ చేయడం ద్వారా డబ్బులు పంపిస్తామని చెబుతున్నారు. అయితే ఇది మోసపూరితమైన వ్యాపారం అని తెలుసుకునేసరికి చాలామంది వినియోగదారులు నష్టపోయారు. ఇప్పటికైనా ఫోన్ ఫామ్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని అనవసరపు వెబ్సైట్లపై క్లిక్ చేయకుండా ఉండాలని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి వెబ్సైట్లపై క్లిక్ చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చట్టపరంగా కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
వినియోగదారులను ఆకర్షించడానికి చాలామంది ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేసి వారు నేరాలకు పాల్పడమే కాకుండా ఇతరుల చేత అక్రమాలను చేయిస్తున్నారు. అందువల్ల ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లలో కొత్తరకమైన వీడియోలు లేదా సర్వేకు సంబంధించిన వీడియోలు ఎదురవుతాయి వాటిని స్కిప్ చేయడమే మంచిదని అంటున్నారు. యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు.