Chiranjeevi Warning To Naveen Polishetty: నిన్న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ , తాజ్ బంజారా హోటల్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంటకు సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు ఇలా ఎంతో మంది హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్ళిలో మంచి జోష్ తో కనిపించిన సెలబ్రిటీలలో ఒకరు నవీన్ పోలిశెట్టి. ఈయన విజయ్ దేవరకొండ కి మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి సినీ ప్రయాణం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తోనే మొదలైంది. ఇద్దరు ఇప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకున్నారు.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
ఇదంతా పక్కన పెడితే నిన్నటి వెడ్డింగ్ రిసెప్షన్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే వాటికంటే కూడా ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో చిరంజీవి లోపలకు అడుగుపెట్టగానే నవీన్ పోలిశెట్టి ఆయన కాళ్లకు మొక్కడం, అందుకు చిరంజీవి ఫన్నీ గా వార్నింగ్ ఇవ్వడం , నవీన్ పోలిశెట్టి నవ్వుతూ ఆయన చేతులు పట్టుకోవడం వంటివి హైలైట్ గా నిలిచాయి. ఇంతకీ చిరంజీవి నవీన్ పోలిశెట్టి తో మాట్లాడిన ఆ మాటలు ఏంటి అంటూ సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది . అభిమానులు కొంతమంది వాళ్ళ కొంతంగా వీళ్ళ సంభాషణ పట్ల సబ్ టైటిల్స్ వేస్తున్నారు. అవేంటో కొన్ని చూద్దాం .
రీసెంట్ గానే వీళ్లిద్దరు హీరోలుగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు , ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు థియేటర్స్ లో సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే చిరంజీవి ‘నీ సినిమా అంత పెద్ద హిట్ అయితే సక్సెస్ మీట్ కి కనీసం నన్ను పిలవలేదు ‘ అని నవీన్ తో అన్నట్టు అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా సంక్రాంతికి నాతోనే పోటీకి వస్తావా అని చిరంజీవి ఫన్నీ గా నవీన్ తో మాట్లాడడం, అందుకు నవీన్ అయ్యో భలే వారే అని చిరు చేతులు పట్టుకోవడం వంటివి చేసారని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
All smiles as Megastar #Chiranjeevi and #NaveenPolishetty share a fun moment at the #VIROSH reception #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/xhZEXPLmJu
— Telugu FilmNagar (@telugufilmnagar) March 5, 2026