Vijay Deverakonda Rashmika rare record: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక. ఎన్నో ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేసిన ఈ జంట , ఈమధ్య కాలంలోనే పెద్దల సమక్షంలో వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టారు. పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తున్నప్పటికీ కూడా, ఇప్పటికీ వీళ్లిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫోటోలు , వీడియో లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరికీ ఉన్నటువంటి క్రేజ్ , ఫాలోయింగ్ మామూలుది కాదు. తెలుగు ఆడియన్స్ తో పాటు వీళ్లిద్దరికీ హిందీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండడం వల్ల, వీళ్లిద్దరు ఏ చిన్న ఫోటో తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేసినా వాటికి మిలియన్ల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి.
ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేసిన ఒక యాడ్ వీడియో కి ఇన్ స్టాగ్రామ్ లో సెన్సేషనల్ రీచ్ వచ్చింది. పూర్తిహి వివరాల్లోకి వెళ్తే , కొంతకాలం క్రితం వీళ్లిద్దరు కలిసి ‘మన్యవార్ వెడ్డింగ్’ అనే యాడ్ లో కలిసి నటించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ యాడ్ వీడియో కి 11.5 మిల్లియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న ఏకైక యాడ్ వీడియో గా దీనికి అరుదైన రికార్డు దక్కింది. ఇక వ్యూస్ అయితే దాదాపుగా 104 మిల్లియన్లకు పైగా వచ్చాయి. ఈ రికార్డు ని భవిష్యత్తులో ఏ సెలబ్రిటీ కూడా అందుకోలేరేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో, మరోసారి ఈ జంట ద్వారానే ఈ రికార్డు కి గండి పడే ప్రమాదం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈ జంట కలిసి Airbnb అనే యాడ్ లో నటించారు. ఈ యాడ్ వీడియో కి ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి.
చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ యాడ్ ‘మన్యవార్ వెడ్డింగ్’ యాడ్ వీడియో రికార్డుని బద్దలు కొట్టేలాగా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నాకు నేనే పోటీ , నాతో నాకే పోటీ అనే ఫేమస్ పవన్ కళ్యాణ్ డైలాగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ డైలాగ్ ప్రస్తుత పరిస్థితిలో ఈ జంటకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జంట చాలా కాలం తర్వాత కలిసి ‘రణబలి’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ రెండు యాడ్ వీడియోస్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే , ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుండి అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.