Vijay Deverakonda Rashmika Wedding Photos: నేడు ఉదయం 10:10 నిమిషాలకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక మందాన(Rashmika Mandanna) వివాహం రాజస్థాన్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి విజయ్ దేవరకొండ , రష్మిక కుటుంబ సభ్యులు , బంధు మిత్రులు , శ్రేయోభిలాషులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుండి కేవలం సందీప్ రెడ్డి వంగ మాత్రమే హాజరు అయ్యినట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లంతా రిసెప్షన్ కి రానున్నారు. మార్చి 4 న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ , తాజ్ బంజారా హోటల్ లో ఈ రిసెప్షన్ జరగనుంది. ఇదంతా పక్కన పెడితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు కాసేపటి క్రితమే సోషల్ మీడియా లోకి వచ్చాయి . అభిమానులు ఈ ఫోటోలను #Virosh అనే ట్యాగ్ ని ఉపయోగించి పోస్ట్ చేస్తున్నారు.
Also Read: ‘చోకర్స్’ పుణ్యమా అని టీమిండియాకు దారి దొరికింది!
ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’ చిత్రం లో వీళ్ళని ఇలా పెళ్లి బట్టలో చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపించారు. ఇప్పుడు నిజ జీవితం లో కూడా వీళ్ళు ఇలా పెళ్లి బట్టలతో దర్శనమిస్తారని ఎవ్వరూ అప్పట్లో ఊహించలేదు. ఇన్ని రోజులు వీళ్లిద్దరు తమ రిలేషన్ ని చాలా గోప్యంగా దాచుతూ వచ్చారు . అయినప్పటికీ సోషల్ మీడియా లో వీళ్ళ రిలేషన్ గురించి లీక్ అయ్యింది. పెళ్లికి వారం రోజులు ముందు వరకు కూడా వీళ్ళు ఓపెన్ అవ్వలేదు. మూడు రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అయితే వీళ్ళ పెళ్ళికి అంబంధించిన వీడియో ని ఒక డాక్యుమెంటరీ గా చేసేందుకు ఎన్నో ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపుగా వంద కోట్ల రూపాయిల ఆఫర్ కూడా ఇచ్చారు . కానీ వీళ్లిద్దరు ఆ ఆఫర్ ని తిరస్కరించారు.
పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకు కూడా వంద కోట్ల ఆఫర్ ఈమధ్య కాలం లో ఏ ఓటీటీ సంస్థ కూడా ఇవ్వలేదు. అలాంటిది కేవలం వీళ్ళ పెళ్లి వీడియో కోసం అంత ఆఫర్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో. దీనిని బట్టీ చూస్తే భవిష్యత్తులో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళ కాంబినేషన్ లో ‘రణబలి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. కచ్చితంగా ఈ చిత్రానికి స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ , రష్మిక ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
One day, I missed her.
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026