Vijay Deverakonda – Rashmika Mandanna : ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిన నటుడు ‘ విజయ్ దేవరకొండ’… ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన కింగ్ డమ్ సినిమాతో ప్లాప్ ని మూట గట్టుకున్న ఆయన తర్వాత చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రష్మిక మందానాతో ‘గీతా గోవిందం ‘, ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఏకంగా విజయ్ దేవరకొండను 100 కోట్ల క్లబ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…ఇక అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ చాలా రకాల వార్తలైతే నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎట్టకేలకు వాళ్ళు రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరి వీళ్ళు ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే పెద్దవాళ్ల కోరిక మేరకు ఏ హడివిడి లేకుండా విజయ్ దేవరకొండ ఇంట్లో ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారట. కానీ వీళ్ళు అందరి సమక్షంలో మరోసారి చాలా పెద్ద ఎత్తున నిశ్చితార్థం చేసుకోవాల్సి చూస్తున్నారట…
అదికూడా సెలబ్రిటీల మధ్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఉన్నారట. అందుకోసమే ఈ వ్యవహారాన్ని రహస్యంగా దాస్తున్నారు. ఇక పెళ్లి ఎప్పుడూ అనేది కూడా తొందర్లో చెప్తామని దానికంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకోవాలని చూస్తున్నారట. ఇక వీళ్ళిద్దరి వైఖరి చూస్తుంటే ఇద్దరు ఒకరికి ఒకరు చాలా ఘాఢంగా ప్రేమించుకున్నారనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్లు అనుకున్న రేంజ్ లో ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోతున్నారు. కాబట్టి తొందరలోనే మరోసారి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ ని నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీళ్ళిద్దరు ఒకటైతే ఇటు విజయ్ అభిమానులు, అటు రష్మిక మందాన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…