Vijay Deverakonda Gift To Rashmika Mandanna: చాలామంది స్టార్ హీరోలు చేయలేని కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి మూవీస్ చేస్తే వాళ్ల ఇమేజ్ దెబ్బ తింటుందేమో అని ఆలోచించే నటులు కూడా ఉన్నారు. కానీ ఒక బోల్డ్ సినిమాను చేసి ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాడు దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికి ఆయన ఎక్కడ కూడా తడబడకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన రష్మిక మందాన ను పెళ్లి చేసుకుంటున్నాడు.
Also Read: విజయ్ – రష్మిక పెళ్లి వచ్చిన అతిధులందరిని ఒక హౌస్ లో బంధించారా..? రూల్స్ ఏంటంటే..?
ఈరోజు వాళ్ళ పెళ్లి సందర్భంగా కొంతమంది సినిమా సెలబ్రిటీలు సైతం వాళ్ళ పెళ్లికి హాజరవ్వబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ పెళ్లికి ముందే విజయ్ రష్మిక కు కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి రష్మిక అంటే తనకి చాలా ఇష్టమని విజయ్ పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఎప్పటినుంచో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికి అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరు మేము మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ వచ్చారు. దాంతో వీళ్ళు ప్రేమించుకుంటున్నారా, లేదంటే ఫ్రెండ్స్ గా ఉన్నారా అనే విషయంలో క్లారిటీ లేక ఒక చిన్న డైలమాలో జనాలైతే ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎట్టకేలకు వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెలిసిన తర్వాత అటు విజయ్ అభిమానులు, ఇటు రష్మిక మందాన ఫ్యాన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు…
విజయ్ సైతం పెళ్లికి ముందే రష్మిక కి ఒక ఖరీదైన విల్లా ను గిఫ్టు గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది… పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు ఒక నెల రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి హనీమూన్ ఎంజాయ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా రష్మిక మందాన విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒకటవ్వడం అనేది ప్రతి ఒక్కరిని ఆనంద పరిచే విషయమనే చెప్పాలి..