Vijay Deverakonda and Rajasekhar : ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో రాజశేఖర్(Doctor Rajashekar). ఆరోజుల్లో ఈయన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలతో సమానంగా ఆడేవి. అయితే గడిచిన దశాబ్ద కాలం నుండి రాజశేఖర్ హీరో గా చేసిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియని పరిస్థితి. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే లతో వచ్చినా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయి. అంటే ఇక ఆడియన్స్ రాజశేఖర్ సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాగా క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యేందుకు రాజశేఖర్ ఎప్పటి నుండో రెడీ. కానీ ఆయన మనసుకి నచ్చే పాత్రలు రాకపోవడంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చాడు.
Also Read : విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతున్న క్రేజీ హీరోయిన్
ఇప్పుడు ఆయన కోరుకున్న పాత్ర దక్కడంతో ఇక నుండి క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్దమైపోయాడు రాజశేఖర్. అందులో భాగాంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్దన్'(Rowdy Janardhan) చిత్రంలో విలన్ గా నటించేందుకు సిద్ధం అయ్యాడు రాజశేఖర్. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన రాజశేఖర్ లుక్స్ టెస్ట్ జరిగింది. ఆయన లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. చూస్తేనే భయపడి పోయే రేంజ్ లో ఆయన లుక్ ని సిద్ధం చేశారట. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక మంచి కథాంశం తో ఈ స్టోరీ ని డెవలప్ చేశారట. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని దిల్ రాజు గతంలో పలు ఇంటర్వ్యూస్ లో వ్యక్తం చేసాడు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ఈయన గతం లో ‘రాజా వారు..రాణి వారు’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
కిరణ్ అబ్బవరం మొదటి సినిమా ఇది, కమర్షియల్ గా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా, ఒక అందమైన క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. అలాంటి ఆహ్లాదకరమైన సినిమా తీసిన రవికిరణ్ కోలా, ఇప్పుడు ఇలాంటి మాస్ సినిమాని చేసేందుకు సిద్దమయ్యాడు. చూడాలి మరి ఎంత వరకు సక్సెస్ అవ్వగలడు అనేది. ఇకపోతే రాజశేఖర్ కి ఈ చిత్రం నుండి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అనే చెప్పొచ్చు. హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఒక సెన్సేషన్. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోనూ జగపతి బాబు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజశేఖర్ కూడా ఆ రేంజ్ కి వెళ్తాడా లేదా అనేది ఈ సినిమాతో అర్థం అయిపోతుంది.
Also Read : చిరంజీవి, రాజశేఖర్ కి ఎందుకు గొడవలు జరుగుతుంటాయి..? వాళ్ల మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే..?