Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా హాయ్ నాన్న సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. అయితే దీనికి నాని చీఫ్ గెస్ట్ గా రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి నాని, విజయ్ దేవరకొండ కి మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ విజయ్ దేవరకొండ సినిమా ఓపెనింగ్ కి నాని రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్, రణబాలి అనే సినిమా చేస్తున్నాడు. ఇక వీటితో పాటుగా ఇప్పుడు శౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుండడం విశేషం… ఇక నాని సైతం ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాని సైతం భారీ లెవెల్లో తెరకెక్కించే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుజీత్ ఇంతకుముందు ఓజీ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ లెవెల్లో ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా నాని – విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా టైర్ వన్ హీరోలుగా మారతారా? లేదా అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాల మీద డిపెండ్ అయి ఉందనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారా లేదంటే డీలా పడిపోతారా అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తుండటం విశేషం…