Bitchat App: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇంటర్నెట్ ఆధారంగా కార్యకలాపాలు సాగించడం కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ లో యాప్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల సామాజిక మాధ్యమ యాప్స్ వాడటం నేటి కాలంలో ఒక అవసరం అయిపోయింది. వీటి ద్వారానే ప్రపంచం మొత్తం తిరుగుతోంది. వీటి ఆధారంగానే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి.. వీటి ఆధారంగా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. అందుకే వీటిని ప్రమోట్ చేసే కంపెనీలు రకరకాల మార్పులు, చేర్పులతో యూజర్ల మనసును దోచుకుంటున్నాయి. అయితే ఈ యాప్స్ మొత్తం కేవలం ఇంటర్నెట్ ఆధారంగానే నడుస్తున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే వీటిని వాడటం సాధ్యం కాదు.
మారిన కాలంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే పనిచేసే మెసేజ్ యాప్ తెరపైకి వచ్చింది. దీనిని ట్యూటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే డెవలప్ చేసాడు.. దీనికి బిట్ చాట్ అనే పేరు పెట్టాడు. ఈ యాప్ కు ఇంటర్నెట్ అవసరం లేదు. ఫోన్ నెంబర్ అవసరం లేదు. సర్వర్ కూడా అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ఆధారంగానే ఇది పనిచేస్తుంది.. ఇది ఫీర్ టు ఫీర్ మెసేజింగ్ యాప్. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. కేవలం ఆఫ్ గ్రిడ్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే దీనిని రూపొందించినట్టు డోర్సే చెబుతున్నారు. ఈ మెసేజ్ యాప్ ట్రెండ్ సెట్టర్ లాగా నిలుస్తుందని డోర్సే అంటున్నారు. టెస్టింగ్ దశ దాటిన తర్వాత త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రపంచంలోనే సంచలనం నమోదు అవుతుందని.. యూజర్లకు అన్ని సేవలు ఉచితంగానే లభిస్తాయని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుత యాప్స్ మొత్తం ఇంటర్నెట్ ఆధారంగానే నడుస్తున్నాయి. వీటికోసం కంపెనీలు భారీ స్థాయిలో సర్వర్లను ఏర్పాటు చేశాయి. వినియోగదారులు కూడా ఇంటర్నెట్ కలిగి ఉంటేనే వీటి సేవలను పొందుతారు. లేకపోతే అంతే సంగతులు.. అయితే ఇంటర్నెట్ లేని ప్రాంతాలలో వీటి సేవలను వినియోగించడం చాలా కష్టం. అందువల్లే జాక్ డోర్ సే బిట్ చాట్ యాప్ రూపొందించారు. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన చెబుతున్నారు. ట్విట్టర్ ను అందుబాటులోకి తెచ్చినప్పుడు కూడా డోర్సే ఇటువంటి సంచలన ప్రకటనే చేశారు. అప్పట్లో ట్విట్టర్ వచ్చినప్పుడు చాలామంది దీన్ని ఎలా వాడతామంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా యాప్ ఇలా ఉంటే ఇలా అంటూ చాలామంది మండిపడ్డారు. కానీ మైక్రో మెసేజింగ్ యాప్ చరిత్రలో ట్విట్టర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మస్క్ చేతుల్లోకి వెళ్లే దాకా ఇది అనేక మందికి ఆమోదయోగ్యంగా మారింది. మస్క్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ట్విట్టర్ అనేక మార్పులకు గురైంది. ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ యాప్ లాగా మారిపోయింది.
ట్విట్టర్ విక్రయించిన తర్వాత డోర్సే అనేక ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో వినియోగించే యాప్స్ విషయంలో ఆయన కొంతకాలంగా రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అలా ఆయన రీసెర్చ్ చేయగా మదిలో మెదిలిన ఆలోచనే బిట్ చాట్. బిట్ చాట్ ను అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకురావాలని డోర్సే తాపత్రయం. అందువల్లే ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే నడిచే విధంగా దానిని రూపొందిస్తున్నారు. టెస్టింగ్ దశ పూర్తయితే మాత్రం అది కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది.. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలలో ఉపయోగించే యాప్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించనుంది. బిట్ చాట్ యాప్ కేవలం చాటింగ్ కోసం మాత్రమేనా.. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ మాదిరిగా అదనపు సౌకర్యాలు ఉంటాయా.. అనే ప్రశ్నకు డార్సే క్లారిటీ ఇవ్వలేదు.