https://oktelugu.com/

Vijay Deverakonda Liger: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్ ని దాటేసిన విజయ్ దేవరకొండ లైగర్

Vijay Deverakonda Liger: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిన స్థార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు..వారిలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోకుండా ఉండలేము..స్వయంకృషి తో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు చిరంజీవి..ఆయనని చూసి ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రోళ్ళు సినిమాల్లో నటించాలి అనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2022 / 04:15 PM IST
    Follow us on

    Vijay Deverakonda Liger: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిన స్థార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు..వారిలో మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోకుండా ఉండలేము..స్వయంకృషి తో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు చిరంజీవి..ఆయనని చూసి ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రోళ్ళు సినిమాల్లో నటించాలి అనే ఆశతో వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు..ఇప్పుడు ఆ లిస్ట్ లోకే చేరబోతున్నాడు లేటెస్ట్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ..చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ని ప్రారంబించి నేడు యూత్ ఐకాన్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన రేంజ్ ని ఏకంగా పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల స్థాయికి పెంచుకున్నాడు..పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన లైగర్ అనే సినిమా కి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది.

    Vijay Deverakonda Liger

    ఇక అసలు విషయానికి విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కతున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో పూర్తి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా టీజర్ కి కూడా నేషనల్ లెవెల్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు సినిమాల స్థాయిలో జరుగుతుంది అట..ముఖ్యంగా ఈ సినిమా రాయలసీమ ప్రాంత హక్కులను ఒక్క డిస్ట్రిబ్యూటర్ 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం..ఇంతటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరుకు ఈ ప్రాంతం లో మహేష్ బాబు సినిమాకి కూడా జరగలేదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇక నైజం ప్రాంతం లో ఈ సినిమా రైట్స్ 40 కోట్ల రూపాయలకు జరుగుతుంది అంటే..అంటే దాదాపుగా ఈ నెంబర్ పవన్ , మహేష్ సినిమాల రేంజ్ అని చెప్పొచ్చు..అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి సినిమాలతో విజయ్ దేవరకొండ కి యూత్ మంచి క్రేజ్ వచ్చింది అనే సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఆ క్రేజ్ పవన్ మహేష్ సినిమాల స్థాయికి ఎదిగింది అనే విషయం నిజంగా అందరిని షాక్ కి గురి చేస్తోంది.

    Vijay Deverakonda Liger

    Also Read: బంధాన్ని తట్టిలేపి కంటెస్టెంట్లను ఏడిపించిన బిగ్ బాస్

    ఇక ఈ సినిమా లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అంత పెద్ద సెలబ్రిటీ ఈ సినిమాలో నటించడం వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ రావడానికి కారణాలలో ఒక్కటిగా చెప్తున్నారు..ఇంకా మరెన్నో ప్రత్యేకతలతో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఇక విజయ్ దేవరకొండ ని ఎవ్వరు కూడా టయర్ 2 హీరోలలో ఒక్కరిగా చూసే రోజులు పొయ్యాయి అనే చెప్పాలి..ఇక నుండి ఆయన సినిమాలు అన్ని కూడా స్టార్ హీరో రేంజ్ బిజినెస్ చెయ్యడం పక్కా లాగ అనిపిస్తుంది..ఎందుకంటే ఈ సినిమా పూర్తి అయినా వెంటనే ఆయన ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక్క సినిమా చెయ్యనున్నారు..సుకుమార్ కి ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పుష్ప సినిమా తో ఆయన బౌండరీలు సైతం దద్దరిల్లిపోయ్యే రేంజ్ లో రీసౌండ్ సక్సెస్ ని అందుకున్నాడు..అలాంటి డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా చెయ్యబోతుండడం తో ఇక విజయ్ దేవరకొండ ని అందరికి స్టార్ హీరో గా చూడవచ్చు అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.

    Also Read: చార్మి – దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అతడేనా??

    Tags