Vijay Deverakonda latest interview: హీరో విజయ్ దేవరకొండ(VIJAY DEVARAKONDA) లేటెస్ట్ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా సమయం కేటాయించలేదన్న ఆయన, గత రెండు మూడేళ్ళలో తాను గడిపిన జీవన విధానం నచ్చలేదు అన్నారు. అందుకు కారణాలు ఏమిటీ? ఇంతకీ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరు?
విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్(KINGDOM) విడుదలకు సిద్ధం అవుతుంది. జులై 31న కింగ్ డమ్ థియేటర్స్ లోకి వస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ చిత్రానికి దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. నేడు తిరుపతి వేదికగా ట్రైలర్ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. ఇక కింగ్ డమ్ విడుదలకు మరో వారం సమయం మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.
Also Read: పవన్ పై అంతులేని ప్రేమను బయటపెట్టిన నటి..అసలు ఎవరు ఈమె?
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రపంచంలో మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. గత రెండేళ్లలో వాటి విలువ నాకు తెలిసొచ్చింది. గత రెండు, మూడేళ్ళలో నేను జీవించిన విధానం నాకు నచ్చలేదు. అమ్మా నాన్నలకు, ఫ్రెండ్స్ కి , గర్ల్ ఫ్రెండ్ కి సమయం కేటాయించలేదు. ఒకరోజు నాకు నేనే ఆ విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు వాళ్లతో టైం స్పెండ్ చేస్తున్నాను. క్వాలిటీ లైఫ్ గడుపుతున్నాను… అని అన్నారు.
కాగా ఇక్కడ విజయ్ దేవరకొండ ప్రస్తావించిన గర్ల్ ఫ్రెండ్ ఎవరనే చర్చ మొదలైంది. హీరోయిన్ రష్మిక మందానతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నాడనే వాదన చాలా కాలంగా ఉంది. వీరిద్దరూ జంటగా పలుమార్లు విహారాలకు వెళ్లారు. వేరు వేరుగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడ ఏకాంతంగా విహరిస్తారని సమాచారం. తాము వెకేషన్ కి వెళ్లిన విషయం రష్మిక ఓ సందర్భంలో అంగీకరించడం విశేషం. విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, అతడితో వెకేషన్ కి వెళితే తప్పేంటని ఆమె సమర్ధించుకున్నారు.
Also Read: కోర్ట్, కన్నప్ప కంటే దారుణమా…. హరి హర వీరమల్లుకి ఊహించని దెబ్బ!
ఇక విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే వేడుకలకు, పండగలకు, పబ్బాలకు రష్మిక హాజరవుతుంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక ఏనాడూ తాము రిలేషన్ లో ఉన్నట్లు ఒప్పుకోలేదు. ఇక రష్మికకు స్టార్డం తెచ్చిన గీత గోవిందం మూవీలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. డియర్ కామ్రేడ్ మూవీలో మరోసారి జతకట్టారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఏదో ఒక రోజు సడన్ గా ఈ ప్రేమ జంట పెళ్లి వార్త చెప్పి షాక్ ఇస్తారనే భావన జనాల్లో ఉంది. మరోవైపు రష్మిక, విజయ్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.