Vijay Deverakonda And Rashmika Mandanna: సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరియు రష్మిక(Rashmika Mandanna) నే కనపడుతున్నారు. వీళ్లిద్దరికి రీసెంట్ గానే నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై వీళ్లిద్దరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, పరోక్షంగా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేవి నిజమే అని సందర్భం దొరికినప్పుడల్లా చెప్పకనే చెప్తున్నారు. రీసెంట్ గానే రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) అనే చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిల్చింది. మొదటి వారం కూడా పూర్తి కాకముందే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
ఈ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఒక స్టార్ హీరో సక్సెస్ ఈవెంట్ అంటే ఆడియన్స్ ఎంతలా ఎదురు చూసారో, ఈ ఈవెంట్ కి కూడా ఆడియన్స్ అంతలా ఎదురు చూసారు. ఎందుకంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట, ఈ ఈవెంట్ సాక్షిగా తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేస్తారేమో అని అనుకున్నారు. అయితే అలాంటిదేమి జరగలేదు కానీ, వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని క్యూట్ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ ఈవెంట్ కి రాగానే అందరినీ పలకరించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇక రష్మిక అయితే స్వయంగా విజయ్ ని పలకరించేందుకు ముందుకు వెళ్ళింది. అప్పుడు విజయ్ రష్మిక చేతిని ముద్దాడడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.
అంతే కాదు, విజయ్ దేవరకొండ ఈవెంట్ కి రాకముందు, రష్మిక ఈవెంట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమంది అభిమానులు ఒక రేంజ్ లో కేరింతలు చేశారు. ఒక అభిమాని అయితే ధైర్యం చేసి ‘రష్మిక దేవరకొండ’ అని గట్టిగా పిలుస్తాడు. దానికి రష్మిక వెనక్కి తిరిగి చూసి, ‘వామ్మో ఏంట్రా మీరు ఇలా ఉన్నారు’ అని నవ్వుతూ సిగ్గు పడుతుంది. ఇలా వీళ్లిద్దరు అధికారికంగా పెళ్లి గురించి ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ కూడా, ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ద్వారా తాము త్వరలోనే ఒక్కటి కాబోతున్నాం అంటూ చెప్పకనే చెప్తున్నారు. అదే విధంగా నిన్నటి ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఒకరిని ఉద్దేశించి ఒకరు మాట్లాడడం హైలైట్ గా నిల్చింది.
