Kingdom Teaser Review: విజయ్ దేవరకొండ (విజయ్ devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Goutham Tinnanuri) దర్శకత్వంలో వస్తున్న ‘కింగ్ డమ్'(Kingdom)సినిమాకు సంబంధించిన టీజర్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ ని కనక మనం చూసినట్లయితే ఎన్టీఆర్ వాయిస్ ఎవరితో టీజర్ మొత్తాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో వచ్చిన డైలాగులు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ ని ఎన్టీఆర్ ద్వారా రివిల్ చేశారు.
‘అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలస పోయిన అలసిపోయిన ఆగనిది మారన రక్తం ఇవన్నీ దేని కోసం ఒక కొత్త రాజు కోసం’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు అద్భుతంగా పేలాయి. నిజానికి విజయ్ దేవరకొండ టీజర్ మొత్తంలో లాస్ట్ షాట్ లో మాత్రమే కనిపిస్తాడు. కానీ టీజర్ అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ వాయిస్ అనే చెప్పాలి. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే ఒక్కొక్కరికి గూస్ బమ్స్ వస్తున్నాయి. ఈ టీజర్ లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి… విజువల్స్ కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి గౌతమ్ తిన్ననూరి ఇలాంటి సినిమా తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు… ఇక ఇదిలా ఉంటే సినిమాలోని ప్లస్ ల గురించి పక్కన పెట్టి మైనస్ ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది మరొక కేజీఎఫ్ రేంజ్ లో తెరకెక్కుతుంది.
అయినప్పటికి కేజీఎఫ్ ప్లేవర్ తో తెరకెక్కినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి షాట్ లో మనకు కేజీఎఫ్ తరహా రిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి… కే జి ఎఫ్ సినిమానే గౌతమ్ తిన్ననూరి స్టైల్ లో తీసినట్టుగా అనిపిస్తుంది. ఇక భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ మధ్య ఈ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఈ సినిమాలో ఒక కొత్త రాజుగా విజయ్ దేవరకొండ సినిమాలో ఎలా కనిపిస్తాడు తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాలో అసలైన ఎలిమెంట్ ఏంటి దాని ద్వారా హీరోకి ఎదురయ్యే కాన్సెప్ట్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…